Horoscope Today (02-09-2022): రోజు మొదలవుతుంటే.. నేటికీ ఎక్కువమంది.. ఏ పనిని ప్రారంభించాలన్నా, ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా రోజులో ఎలా ఉంటుంది. అని ఆలోచిస్తారు. ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 2వ వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళిక విషయంలో స్పష్టత వస్తుంది. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మంచి పనులను చేపడతారు. కీలక విషయాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అధిక శ్రమ తో కూడిన ఫలితాలను పొందుతారు. మానసికంగా బలంగా ఉండాల్సి ఉంటుంది. ఇతరులను కలుపుకుని వెళ్లడం వలన ఇబ్బందులు తగ్గుతాయి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ఉత్సాహపరిచే సంఘటనలు జరుగుతాయి. ఆనందాన్ని కలిగించే శుభవార్తను వింటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు సొంత నిర్ణయాలతో సక్సెస్ అందుకుంటారు. నిబద్దతతో పనిచేసి.. విజయాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యం పై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. నిపుణుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆటంకాలను అధిగమించి ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. బాధను కలిగించే వార్తను వింటారు. నిరుత్సాహ పరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో పెద్దలను కలిసి ముందుకు అడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కలహాలకు దూరంగా ఉండడం మేలు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధువులతో తగులకు దూరంగా ఉండడం మేలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా మెలగడం మేలు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)