Horoscope Today: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్యేమీ ఉండకపోవచ్చు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు..
ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్యేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను చురుకుగా పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో కొత్తగా గుర్తింపు ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఆర్థిక పరి స్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లాభాలు ఆర్జిస్తారు. సాధా రణ అనారోగ్యాలు ఉంటే ఉండవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువులు లేదా పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులకు సహాయం చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్యేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను చురుకుగా పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో కొత్తగా గుర్తింపు ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగు లకు, అవివాహితులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సుఖ సంతోషాలు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగానే సాగిపోతాయి కానీ, అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు ఎప్పటి మాదిరిగానే సాగిపోతాయి. మంచి స్నేహాలను ఏర్పరచుకుంటారు. స్నేహితుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో మధ్య మధ్య చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు అందివస్తాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, కింది ఉద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సాటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. డాక్టర్లు సామాజిక సేవలందిస్తారు. లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది.ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొందరు సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లి తండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఒకటి రెండు కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. సొంత పనులు పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అర్ధాష్టమ శని కారణంగా పనులు ఆలస్యం కావడం, తరచూ స్వల్ప అనారోగ్యాలకు గురి కావడం వంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతానికి ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కీలక విషయాల్లో గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలు న్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్ప డుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయా ణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వృత్తి జీవి తంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఎవరినీ తేలికగా నమ్మకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితుల సహకారం ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.