Horoscope Today: తోటివారిని కలుపుకొని పోవడం ఈ రాశివారికి ఇబ్బందులు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ..

Horoscope Today: తోటివారిని కలుపుకొని పోవడం ఈ రాశివారికి ఇబ్బందులు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 22, 2021 | 6:49 AM

Horoscope Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం.

మేషరాశి:

ఈ రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అధికారులను కలుసుకుంటారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. దుర్గాదేవి నామస్మరణం మేలు చేస్తుంది.

వృషభరాశి:

ఈ రాశివారికి కొందరి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. ధైర్యంతో ముందుకెళ్లా్ల్సి ఉంటుంది. ఇష్టదైవాన్ని కోలువడం మేలు జరుగుతుంది.

మిథున రాశి:

ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మన్యస్వామి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటకరాశి:

ఈ రాశివారికి చేపట్టే పనులలో పురోగతి ఉంటుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల సహాలు ఎంతగానో మేలు చేస్తాయి. ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. ఈశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.

సింహరాశి:

ఈ రాశివారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులు, మిత్రుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. దుర్గాదేవిని పూజించడం మంచి జరుగుతుంది.

కన్యరాశి:

కొన్ని అనుకొని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవనసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

తులరాశి:

ఈ రాశివారు మంచి పేరు సంపాదించుకుంటారు. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. ఆర్థికపరంగా మంచే జరుగుతుంది. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. లక్ష్మీస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి చేపట్టే పనులలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. బంధు, మిత్రులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టతేవతను స్మరించడం మంచి జరుగుతుంది.

ధనుస్సురాశి:

ఈ రాశివారు చేపట్టే పనులలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.

మకరరాశి

ఈ రాశివారు ఈ రోజు మంచి పనులు చేపడతారు. కీలక విషయాలలో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేల చేస్తుంటుంది.

కుంభరాశి:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మేలు జరిగే అంశాలుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా ముందుకు సాగుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

మీనరాశి:

తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.