Horoscope Today: వారికి ఉద్యోగంలో అధికార యోగం.. 12 రాశులకు సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 20, 2025): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృషభ రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (జనవరి 20, 2025): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృషభ రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక సంబంధ మైన సమస్యలు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం మీద ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా ఆశించిన ఫలి తం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చేప ట్టిన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయంలో కొద్దిపాటి వృద్ధి ఉంటుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయ పడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ప్రయాణాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. సొంత ఇంటి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. షేర్లు, స్పెక్యు లేషన్ల వల్ల బాగా లాభాలు పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. దశమ స్థానంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలు తప్పకపోవచ్చు. శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవ హా రాలు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమ వుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్త అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొద్దిగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోఝగం లభిస్తుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన స్థానం, ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గ డం ఉండకపోవచ్చు. ఆదాయ వృద్ది ప్రయత్నాలు చేపట్టడానికి ఇది మంచి సమయం. సాధార ణంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందు తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవి తంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫల మవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు.



