- Telugu News Photo Gallery Spiritual photos Surya Grahan 2025: These zodiac signs to have luck due to first solar eclipse of the year
Surya Grahan 2025: ఈ ఏడాది సూర్య గ్రహణంతో వారికి అదృష్ట యోగాలు!
Solar Eclipse 2025: ఈ ఏడాది మార్చి 29న పాక్షిక సూర్య గ్రహణం సంభవించబోతోంది. ఇది భారతదేశంలో కనబడక పోయినప్పటికీ, మీన రాశిలో రవి, చంద్ర, రాహువులు కలవడం వల్ల జాతకపరంగా మాత్రం గ్రహణ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ గ్రహణం వల్ల ఏ రాశికీ పెద్దగా నష్టాలు కలిగే అవకాశం లేనప్పటికీ, కొన్ని రాశులకు మాత్రం శుభ యోగాలనిచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ గ్రహణం మార్చి 28 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఆకస్మిక ధన లాభం, ఉద్యోగ లాభం, ఆస్తి లాభం వంటివి అనుగ్రహించే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jan 20, 2025 | 6:06 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సూర్య గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వృత్తి, వ్యాపారాలు లాభాలను పండిస్తాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. తల్లితండ్రుల నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఊహించని స్థాయిలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, ఆర్థిక లావాదేవీలు వగైరాల వల్ల అత్య ధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సూర్య గ్రహణం ఏర్పడుతున్నందువల్ల విదేశీ అవకాశాలు కొద్ది ప్రయ త్నం చేసినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు మాత్రమే సఫలం అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి వారసత్వపు సంపద లభిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభించడం, ఆర్థికంగా అనుకూలతలు పెరగడం, వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కలలో కూడా ఊహించని విధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల ఉద్యోగుల్లోని ప్రతిభా పాటవాలు, శక్తి సామ ర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అనేక అవకాశాలు అంది వస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభాల వర్షం కురిపిస్తాయి. మనసులోని కోరికలు, ఆశల్లో చాలా భాగం నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి.

మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభం కలుగు తుంది. మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యలు, కష్ట నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదురుతాయి. మనశ్శాంతి లభిస్తుంది.





























