Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన నష్టం.. మంగళవారం రాశిఫలాలు..
Rasi Phalalu Today: దైనందన జీవితంలో.. మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలతో మన పరిస్థితులు ప్రమాదంలో పడతాయి. కావున తీసుకునే
Rasi Phalalu Today: దైనందన జీవితంలో.. మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలతో మన పరిస్థితులు ప్రమాదంలో పడతాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంగళవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా, కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. అయితే.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో ఓ సారి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారు భవిష్యత్తు కార్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించేలా ముందుకెళ్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి: ఈ రాశివారు ఈ రోజు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. శుభ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే పనులు పూర్తవుతాయి. ఇష్టదైవాన్ని ఆరాధిస్తే మంచిది.
మిథున రాశి: ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యం వెంటాడుతుంది. వృథా ప్రయాణాలు, స్థానచలన సూచనలున్నాయి. స్నేహితులు, బంధువులతో విరోధం ఏర్పడకుండా ముందుకు సాగాలి.
కర్కాటక రాశి: పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్తలు అవసరం. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చెడు సహవాసం వైపు వెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహ రాశి: శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు మిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ అండతో శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
కన్య రాశి: శారీరక శ్రమ పెరిగుతుంది. దీంతోపాటు అందుకు తగిన ఫలితాలను అందుకుంటారు. అనుకున్న పనులను ప్రణాళికపరంగా ముందుకెళ్తే పూర్తయ్యే అవకాశాలున్నాయి.
తులా రాశి: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరిగినా అనుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధనలాభం, ప్రయత్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.
ధనుస్సు రాశి: బంధు, మిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
మకర రాశి: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులున్నాయి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయినా కొన్ని ముఖ్యమైన కార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈ రాశి వారు బంధు,మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
మీన రాశి: మీ మీ రంగాల్లో మీ శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.
ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుటం మంచిది. సోదరులతో వైరమేర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటే మంచిది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది.
Also Read: