Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగుల కల సాకారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒకటి పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగుల కల సాకారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 19 September 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒకటి పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ఆదరణ బాగా పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒకటి పూర్తవుతుంది. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రావలసిన సొమ్ము సకాలంలో వచ్చి చేరుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, వాటిని నిదానంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి స్పందన లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ప్రయాణాలు ఆశించిన ప్రయోజనాలతో విజయవంతంగా ముగుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం కొనసాగుతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. నిరుద్యోగుల మనసులోని కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ పని చేపట్టినా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు కూడా నత్తనడక నడు స్తాయి. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు నిలకడగా సాగుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది కానీ, ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనులు, వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూ లంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఒక శుభ కార్యంలో బంధువులకు సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశ ముంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రావలసిన డబ్బును వసూలు చేసుకునే కార్యక్రమం చేపడతారు. బాకీలు, బకాయిలు తప్ప కుండా వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాలను సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అద నపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యో గం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు చేరువ అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలపరంగా కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవు తాయి. ఉద్యోగంలో అధికారులు మీ సమర్థతను గుర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగి పోతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఆరోగ్య భంగానికి అవ కాశం లేదు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఎవరి దగ్గరా డబ్బు తీసుకోవద్దు. ఎవరికీ డబ్బు ఇవ్వొదు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొన్ని కీలకమైన వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అయితే, ఉచిత సహాయాలకు, దానధర్మాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా చిన్నా చితకా సమస్యలుండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ముఖ్య మైన అవసరాలు చాలా వరకు గడిచిపోతాయి. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన సమస్యలు, ఇబ్బందులు తప్పక పోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. అధికారు లకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు బంధువులు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సఫలం అవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!