- Telugu News Photo Gallery Spiritual photos Shukra in Thula rashi women of these zodiac signs to have raja yogas details in telugu
Raja Yoga For Women: తులా రాశిలో శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు రాజయోగాలు
సంపదకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో ప్రవేశించాడంటే మహిళలకు లబ్ధి చేకూర్చకుండా ఆ రాశి నుంచి నిష్క్రమించే అవకాశం ఉండదు. శుక్రుడు స్త్రీ గ్రహం. అందువల్ల ఎవరికి సహాయం చేసినా, చేయకపోయినా మహిళలకు మాత్రం శుక్రుడు తప్పకుండా చేయూతనందిస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ నెల 19 (గురువారం) నుంచి అక్టోబర్ 13 వరకు తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశులకు చెందిన మహిళలకు రాజయోగాలనివ్వడం జరుగుతుంది.
Updated on: Sep 19, 2024 | 5:54 PM

సంపదకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో ప్రవేశించాడంటే మహిళలకు లబ్ధి చేకూర్చకుండా ఆ రాశి నుంచి నిష్క్రమించే అవకాశం ఉండదు. శుక్రుడు స్త్రీ గ్రహం. అందువల్ల ఎవరికి సహాయం చేసినా, చేయకపోయినా మహిళలకు మాత్రం శుక్రుడు తప్పకుండా చేయూతనందిస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 13 వరకు తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశులకు చెందిన మహిళలకు రాజయోగాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల మహిళలకు జీవితం రాజయోగంగా సాగిపోతుంది.

మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. శత్రువుల మీద విజయం లభి స్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అత్యధికంగా సంపాదించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి శుక్ర సంచారం వల్ల ఆశయాలు, ఆశలు నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. తల్లి వైపు నుంచి ఆశించిన సహాయ సహకా రాలు లభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగిపో తుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది.

కన్య: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో ధనాధిపతిగా శుక్ర సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బ డిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు, వేతనాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మాటకు విలువ పెరు గుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. బ్యాంక్ నిల్వలు బాగా పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరు గుపడుతుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆశలు, ఆశయాలు తప్పకుండా నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంలో అంచనాలకు మించి లాభాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఏ రంగంలో ఉన్నవారికైనా సమ ర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది.

మకరం: ఈ రాశికి దశమంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశికి చెందిన మహిళలు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా విజయవంతం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, చదువులకు అవకాశం ఉంది. ఉద్యోగం లోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో ప్రాధాన్యం పెరుగు తుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. సామాజికంగా పలుకుబడి బాగా పెరుగుతుంది.



