Horoscope Today: ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 16, 2024): మేష రాశి వారికి సోమవారంనాడు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో అధికారులు సంతృప్తి చెందే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 16, 2024): మేష రాశి వారికి సోమవారంనాడు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో అధికారులు సంతృప్తి చెందే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. మీ మీద ఆధారపడడం ఎక్కువవుతుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి మంచి గుర్తింపు, డిమాండ్ లభిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. బంధువులకు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యుల మీద అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులు సంతృప్తి చెందే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజ నీర్ల వంటి వృత్తుల వారికి రాబడి వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఉన్నవారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది. సన్నిహితుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడి నిలకడగా కొనసాగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యతకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను బాగా పెంచడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే సూచన లున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. దనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన అంచనాలను దాటుతుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యో గులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. పలుకు బడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందు తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా అనుకూలంగా, జయప్రదంగా జరిగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెర వేరుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో అనుకూల తలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచ నలున్నాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )
ఇంటా బయటా పని ఒత్తిడి, బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనేక విధాలుగా ఆదాయ వృద్ది ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. ఉద్యోగ జీవితంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవు తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చేసుకుంటాయి. బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతారు. శ్రమ, ఒత్తిడి, తిప్పట కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపా రాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలే సుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు.