Shukra Gochar 2024: స్వక్షేత్రం తులా రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త!
సుఖ సంతోషాలకు, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు సాధారణంగా శుభ ఫలితాలనే ఇస్తాడు. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 13 వరకూ తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలను మరింత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, ప్రస్తుత సంచారంలో కొన్ని రాశులకు దుస్థానాల్లో ఉన్నందువల్ల ప్రతికూల ఫలితాలు ఇవ్వనప్పటికీ మిశ్రమ ఫలితాలను మాత్రం ఇవ్వడం జరుగుతుంది.
సుఖ సంతోషాలకు, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడు సాధారణంగా శుభ ఫలితాలనే ఇస్తాడు. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 13 వరకూ తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలను మరింత ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, ప్రస్తుత సంచారంలో కొన్ని రాశులకు దుస్థానాల్లో ఉన్నందువల్ల ప్రతికూల ఫలితాలు ఇవ్వనప్పటికీ మిశ్రమ ఫలితాలను మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు కొన్ని మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్నా విలాసాల మీదా, స్నేహితుల మీదా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. కొందరు బంధుమిత్రులతో అకారణ విభేదాలు, వివా దాలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో కొన్ని మాత్రమే పూర్తవుతాయి. పెళ్లి సంబంధాలు అతి కష్టం మీద కుదురుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు.
- సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వ్యయ ప్రయాసలతో, గట్టి ప్రయత్నంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది కానీ, చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దశలో ఆగిపోతుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండకపోవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి వ్యయస్థానంలో శుక్ర సంచారం వల్ల అనవసర పరిచయాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. ఆదాయ వృద్ధి మందగిస్తుంది. ప్రతిదీ చేతి దాకా వచ్చి ఆగిపో తుంది. కుటుంబ జీవితంలో చిన్నా చితకా సమస్యలు తలెత్తుతాయి. దాంపత్య జీవితం సజా వుగా సాగదు. అపార్థాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనవసర పరిచయాలు పెరుగుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. మిత్రుల వల్ల కూడా నష్టపోతారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో హోదా పెరిగే అవకాశం ఉంది కానీ, పని భారం మరింతగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పోటీదార్లు పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
- కుంభం: ఈ రాశికి నవమ స్థానంలో శుక్ర సంచారం వల్ల విదేశీ అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. అయితే, అవి ఆశించినంతగా సంతృప్తినివ్వవు. ఆదా యం దిన దినాభివృద్ధి చెందుతుంది కానీ, చేతిలో డబ్బు నిలవదు. విలాసాల మీద బాగా ఖర్చు పెరుగుతుంది. ఉచిత సహాయాలు, దాన ధర్మాల వల్ల ఇబ్బంది పడతారు. వస్త్రాభరణాల కొను గోలు మీద అనుకున్నదాని కంటే ఖర్చు పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపాల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. కొందరు మిత్రులను నమ్మి ఆర్థికంగా మోస పోయే అవ కాశం కూడా ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది కానీ, అది సంతృప్తి కలిగించకపోవచ్చు.