Horoscope Today: ఈరోజు ఈరాశి స్త్రీలకు ధన లాభం ఉంది.. నేడు మీ రాశిఫలాలు ఎలాఉన్నాయంటే..

Horoscope Today (15-12-2021):  మనిషిని నమ్మకం నడిపిస్తుంది. దీంతో ఎవరైనా సరే ఈరోజు ఎలా ఉంటుంది.. మంచి చెడులు ఏమిటి..? చేపట్టిన పనులు జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడతాయా

Horoscope Today: ఈరోజు ఈరాశి స్త్రీలకు ధన లాభం ఉంది.. నేడు మీ రాశిఫలాలు ఎలాఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2021 | 6:55 AM

Horoscope Today (15-12-2021):  మనిషిని నమ్మకం నడిపిస్తుంది. దీంతో ఎవరైనా సరే ఈరోజు ఎలా ఉంటుంది.. మంచి చెడులు ఏమిటి..? చేపట్టిన పనులు జరుగుతాయా.. ఆటంకాలు ఏర్పడతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 15వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ప్రశంసలను పొందుతారు. సంతోషంగా గడుపుతారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బలపడతారు. స్త్రీలలు ఈరోజు సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త పనులను చేపడతారు. కొత్తవస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతృప్తీ కరంగా సాగుతుంది.  కొత్తపనులను ఉత్సాహంగా చేపడతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కొత్త పనులు చేపడతారు. చేసిన అప్పులు తీరుస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక  ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. కుటుంబం విషయంపై అనాసక్తత ఏర్పడుతుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. విద్యార్థులకు అనుకులంగా ఉంది. ఇంట్లో కొని మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనులు సులభంగా జరుగుతాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఆందోళన తొలగి.. సంతోషంగా ఉంటారు. ప్రయాణల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.టుంబ కలహాలు దూరమవుతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారికీ చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విందు వినోద కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్త్రీ వలన ధన లాభం కలుగుతుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు ఆకస్మిక ధననష్టాన్ని పొందుతారు. స్థిరాస్తివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.    క్రీడాకారులకు, రాజకీయరంగాల్లో ఉన్నవారు మానసిక ఆందోళనకు గురవుతారు. కొత్తగా చేపట్టే పనులను వాయిదా వేసుకోవడం మంచిది.

Also Read:   కుటుంబంలో అన్నం, డబ్బు కొరతని తీర్చి ఆకలి అన్న మాటలేకుండా చేసే అన్నపూర్ణ జయంతి..