Annapurna jayanti: కుటుంబంలో అన్నం, డబ్బు కొరతని తీర్చి ఆకలి అన్న మాటలేకుండా చేసే అన్నపూర్ణ జయంతి..

Annapurna jayanti 2021:తల్లి అన్నపూర్ణ పార్వతీ దేవి స్వరూపం. భూమిపై ఆహారం, నీటి కొరత ఏర్పడినప్పుడు పార్వతి దేవి అన్నపూర్ణా దేవి రూపంలో అవతరించి ప్రజలకు కష్టాలను తొలగించింది. మాతా అన్నపూర్ణ జయంతి తేదీ, ప్రాముఖ్యత. పూజా విధానం

Annapurna jayanti: కుటుంబంలో అన్నం, డబ్బు కొరతని తీర్చి ఆకలి అన్న మాటలేకుండా చేసే అన్నపూర్ణ జయంతి..
Annapoorna Jayanthi
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2021 | 6:28 AM

Annapurna jayanti 2021: ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు. ఈరోజున పార్వతి దేవి అన్నపూర్ణగా అవతరించిందని నమ్ముతారు. ఒకొనొక సమయంలో భూమిపై ఆహార కొరత ఏర్పడిందని, అప్పుడు జీవులు ఆహారం కోసం అల్లల్లాడుతున్న సమయంలో పార్వతీమాత ప్రజల కష్టాలను తీర్చడానికి అన్నపూర్ణగా..  అవతరించింది. ఈ ఏడాది అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 19 ఆదివారం రోజున వచ్చింది. ఈ రోజున అన్నపూర్ణ తల్లిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆహారం, నీరు , డబ్బుకు లోటు ఉండదని హిందువుల నమ్మకం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, న్నపూర్ణ తల్లి పూజా విధానానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం..

అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత అన్నపూర్ణ జయంతి జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే. మనం ఆహారం నుండి జీవితాన్ని పొందుతాము. కనుక మనం ఎప్పుడూ ఆహారాన్ని అగౌరవపరచకూడదు లేదా వృధా చేయకూడదు. అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసి అగ్నిని, ఆహారాన్ని పూజించాలి. దీనితో ఆకలి అన్నవారికి అన్నదానం చేయాలి. ఇలా చేస్తే అన్నపూర్ణ మాత చాలా సంతోషిస్తుందని.. తమపై అన్నపూర్ణ కరుణ చూపించి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుందని భక్తుల విశ్వాసం.  అన్నపూర్ణ జయంతిని జరుపుకోవడం వలన కుటుంబంలో సంతోషము ఉంటుంది. ఇల్లు సిరి సంపదతో నిండి ఉంటుంది.

పూజా విధానం:  అన్నపూర్ణ జయంతి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్రలేచి తలస్నానం చేసి పూజా స్థలాన్ని, వంటగదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం గంగాజలంతో శుద్ధిచేసుకోవాలి. వంట చేసుకొనే పొయ్యిని పసుపు, కుంకుమ, అక్షతం, పువ్వులు మొదలైన వాటితో పూజించాలి. తర్వాత అన్నపూర్ణ తల్లి విగ్రహాన్ని ఒక ప్లేస్ లో అమర్చి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఒక నూలు దారం తీసుకుని దానికి 17 ముడులు వేయాలి. ఆ దారానికి చందనం, కుంకుమ పూసి, అన్నపూర్ణ తల్లి చిత్రపటం ముందు ఉంచి అక్షతలతో పూజ చేయాలి. అనంతరం అన్నపూర్ణాదేవి కథ చదువుకోవాలి. అనంతరం అమ్మని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ.. పూజ చేసే సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే.. క్షమించమని అమ్మని కోరుతూ.. తమ కుటుంబంపై సదా తల్లి కరుణ చూపమని ప్రార్ధించండి. అనంతరం స్త్రీ, పురుషులు తోరణం కట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత పేదవారికీ అన్నదానం చేయాలి.

అన్నపూర్ణ దేవి కథ:  పురాణాల ప్రకారం.. ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమను ఆడుకుని ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ, విష్ణువులను ప్రార్థించారు. దీంతో బ్రహ్మ , విష్ణువులు శివుడిని యోగ నిద్ర నుండి మేల్కొలిపి..  మొత్తం సమస్య గురించి శివుడికి తెలియజేస్తారు. సమస్యను పరిష్కరించడానికి, శివుడు స్వయంగా భూమిని పరిశీలించాడు. అప్పుడు పార్వతీమాత అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమిపై దర్శనమిచ్చింది. ఆ తర్వాత శివుడు బిచ్చగాడి రూపంలో వచ్చి అన్నపూర్ణాదేవిని దగ్గర అన్నం తీసుకుని.. ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు. అనంతరం భూమిపై ఆహారం, నీటి సంక్షోభం ముగిసింది. మాత పార్వతి అన్నపూర్ణగా దర్శనమిచ్చిన రోజు.. మార్గశిర మాసం పౌర్ణమి. అప్పటి నుండి ఈ రోజును అన్నపూర్ణ మాత అవతారదినోత్సవంగా జరుపుకుంటారు.

Also Read:

న్యూమరాలజీలో ఈ నెంబర్ అత్యంత పవర్‌ఫుల్.. కాని ఇది మాత్రం మరిచిపోవద్దు..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.