Horoscope Today: ఆ రాశుల వారికి శుభవార్తలు అందుతాయి.. మంగళవారం దినఫలాలు..
దిన ఫలాలు (మార్చి 12, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మిథునం రాశి వారి ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 12, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మిథునం రాశి వారి ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివా దాల్లో రాజీమార్గాలు అనుసరిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. చేపట్టిన పనులు సకా లంలో పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి మార్గాలు ఏర్పడతాయి. దైవ కార్యాల మీదా, శుభ కార్యాల మీదా బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. కొన్నివ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడు తుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల్లో ఒకరికి చదువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. పెద్దల సలహాలు తీసుకుని వ్యాపారంలో ముందుకు దూసుకు వెడతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సంతృప్తికరంగా లక్ష్యాలు, బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకా శాలు అందివస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు తమకు అందిన ఆఫర్లను సద్వి నియోగం చేసుకోవడం మంచిది. సన్నిహితులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరుగు తుంది. దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు పదోన్నతి, ఇంక్రిమెంట్లకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవారికి శ్రమ పెరిగినప్పటికీ అంచనా లకు తగ్గట్టుగా మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రు లకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపా రంలో కొత్త ప్రణాళికలను చేర్చి లబ్ధి పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడ తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలుండే అవకాశం ఉంది. శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ జీవితం సాను కూలంగా గడిచిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా ఆశించిన విధంగా సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు మీద ఆధారపడడం మంచిది. ఇష్టమైన బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొందరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనవసర స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా, ఆదాయానికి లోటు లేకపోయినా ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉండడం మంచిది. డాక్టర్లు, లాయర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు బాగా ఉపయోగించుకోవడం జరుగు తుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలకు వెడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగు తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల దెబ్బతింటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.