Horoscope Today: ఆ రాశి వారు బాకీలను రాబట్టుకుంటారు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఒత్తిళ్లు, ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు కొద్దిగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి కొన్ని కొత్త ఆదాయ మార్గాలు వారి ముందుకు వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు బాకీలను రాబట్టుకుంటారు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 10th September 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 10, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఒత్తిళ్లు, ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు కొద్దిగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి కొన్ని కొత్త ఆదాయ మార్గాలు వారి ముందుకు వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఒత్తిళ్లు, ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా ముగుస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యో గంలో బాధ్యతల నిర్వహణలో అధికారులకు ఉపయోగపడతారు. వృత్తి జీవితంలో ఎదుగుదల కని పిస్తుంది. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు సంపాదిస్తారు. కొద్దిగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయట పడతారు. వృత్తి జీవితంలో ఒక కొత్త గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యో గులకు స్థానికంగా మంచి అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ పరిస్థి తులు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవ కాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడంతో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిత్రుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను ఏదో విధంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగు తాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలి తాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. దూరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆస్తిపాస్తుల విషయంలో సోదరుల నుంచి అనుకూల సమాచారం అందు తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కష్టార్జితానికి దీటుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కొందరు బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో పని భారం అధికంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. కొన్ని వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుం టాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగు తుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తారు. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. విందు కార్యక్రమంలో ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారానికి సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో సహోద్యో గులకు సహాయ సహకారాలు అందిస్తారు. కీలక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులున్నా పూర్తి చేస్తారు. ప్రతి పనికీ ఒకటి రెండుసార్లు తిరిగాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం బాగా అనుకూ లంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొన్ని మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని లేదా ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. దైవ కార్యాలకు ధన సహాయం అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. రావల సిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి.