Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (October 08, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. రాదనుకున్న డబ్బు కూడా వసూలవుతుంది. వృషభ రాశి వారికి బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (అక్టోబర్ 8, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటులేని పరిస్థితి ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా, ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. రాదనుకున్న డబ్బు కూడా వసూలవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కీలక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సానుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు, వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మీ సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. పని ఒత్తిడి నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభ వార్తలు అందుకుంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, కొన్ని పెండింగ్ పనులను సవ్యంగా చక్కబెడతారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్దాసక్తులు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు ఇతరుల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కొన్ని పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం ఉత్తమం. ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. సమాజంలో కూడా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. వస్త్రాభరణాల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్మును జాగ్రత్తగా వసూలు చేసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. భారీ లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం పెరిగి కొన్ని కష్ట నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి వివాదాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు సజావుగా సాగిపోతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు అదనపు బాద్యతలు అప్పగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగు తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. సొంత పనులు, వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అను కూలంగా సాగుతుంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకోకుండా ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.



