Horoscope Today: కొత్త ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు..!

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉంటుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి 12 రాశుల వారికి శుక్రవారంనాడు (జులై 7న) ఎలా ఉంటుందో రాశిఫలాలు తెలుసుకోండి.

Horoscope Today: కొత్త ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు..!
Horoscope 07th July 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 07, 2023 | 6:10 AM

Horoscope Today(07th July): జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉంటుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి 12 రాశుల వారికి శుక్రవారంనాడు ఎలా ఉంటుందో రాశిఫలాలు తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. స్థిరాస్తికి సంబం ధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు ఆశలు, ఆశయాలు నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ, సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని చక్కబెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమయిన పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పరంగా పైచేయి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగం విషయంలో మంచి సమాచారం అందుతుంది. కొద్ది ప్రయాసతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో ముందుకు సాగుతాయి. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. గృహ, వాహన సంబంధమైన క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలకు ఎదురు ఉండదు. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగా లలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అధికార వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు వెడతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుం టారు. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. మిత్రుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారం కూడా నిలకడగా ముందుకు సాగుతుంది. కొత్త లావాదేవీలకు సంబంధించి కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): బంధువర్గం నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు ఏర్పడే సూచనలున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు కొంత మేరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల కనిపిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్త అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): అనుకున్న పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోతాయి. వ్యాపారాలలో కూడా సంపాదన నిలకడగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు కొంత మేరకు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల పరిస్థితి సజావుగానే సాగిపోతుంది కానీ, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. చేయని పనికి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య శాస్త్రం పట్ల వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.