వృశ్చికం: ప్రస్తుతం వృత్తి, ఉద్యోగాల స్థానాన్ని శని వీక్షిస్తున్నందువల్ల నిర్విరామంగా, అవిశ్రాంతంగా పని చేయడం, బరువు బాధ్యతలను మోయడం తప్పనిసరి అవుతుంది. ఒక్క వృత్తి, ఉద్యోగాలలోనే కాదు, ఇంటా బయటా కూడా చాకిరీ పెరుగుతుంది. అధికారులతో పాటు, సహోద్యోగులు సైతం తమ బాధ్యతలను, తమ విధులను ఈ రాశివారికి అప్పగించే సూచనలున్నాయి. ప్రతిఫలం లభించే అవకాశం కూడా లేకపోవచ్చు. అర్ధాష్టమి కారణంగా ఈ రాశివారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా ఆదుకునే అవకాశం కూడా తక్కువగా ఉండవచ్చు.