Horoscope Today: వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 6, 2025): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, స్నేహితుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయానికి లోటుండదు. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 06th Feb 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 06, 2025 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 6, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, స్నేహితుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, స్నేహితుల మీదా, విలాసాల మీదా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపె ట్టినా సఫలమవుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో లక్ష్యాలు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శత్రు వులు, పోటీదార్ల బెడద బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది శ్రమతో అధిక లాభాలి స్తాయి. ఆదాయపరంగా ఏ చిన్న ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్య తలు అప్పగిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు అనుకోకుండా పరిష్కారమవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది. అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులేమీ ఉండవు. పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి సంబంధించిన శుభవార్త వింటారు. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. విశ్రాంతి కరువవుతుంది. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తుంది. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపో తుంది. కుటుంబ సమస్యలు కొద్దిగా చక్కబడతాయి. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగ స్వామిని సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు సజావుగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులను కలు సుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కాస్తంత బిజీ అవుతారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారమవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి.చ కొద్దిపాటి వ్యయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే కార్యక్రమాలు చేప డతారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవు తాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం అనేక విధాలుగా బాగా పెరుగుతుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. సోదర వర్గంతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశిం చిన ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.