AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (Feb 04, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 04 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 4, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. అన్నదమ్ములతో విభేదాలు సమసిపోతాయి. వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు ఆశించిన స్థాయిలో లాభిస్తాయి. వ్యాపారాల్లో ఉన్న కొన్ని కీలక సమస్యల్ని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పని భారం పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదనపు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యాపారాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. తోబుట్టువులతో వీలైనంత సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. దాంపత్య జీవితం హ్యాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రధాన లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేస్తారు. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. అధికారులు లక్ష్యాలను పెంచే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలు సర్దుమణుగుతాయి. ఆహార, విహారాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఏర్పడి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సాయంతో ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఊహించని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం విస్తరించడానికి, పురోగతి చెందడానికి అవకాశం ఉంది. వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు చేపడతారు. శత్రువులు, పోటీదార్ల బెడద నుంచి ఊరట లభిస్తుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేసే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సామరస్య వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశముంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబపరంగా శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. రావాల్సిన సొమ్ము అనుకోకుండా చేతికి అందుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా, చేపట్టిన పనుల్ని తేలికగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. భద్రతకు, స్థిరత్వానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఇష్టమైన బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలదొక్కుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితి చక్కబడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభసాటి ఒప్పందాలు జరుగుతాయి. ఆదాయం పరవాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలున్నా కోలుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి.