AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..! ఈ రాశుల వారికి ఆదాయానికి మించి ఖర్చులు..!

Financial Horoscope: రాబోయే రెండు నెలల పాటు కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం బాగున్నా అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరు ఖర్చుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తున్నందు వల్ల వీరు అందుకు సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. తరచూ శివార్చన చేయించడం, గణపతి స్తోత్రం పఠించడం వల్ల ఆదాయం నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 5:35 PM

Share
మేషం: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు ఉండే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులకు బాగా అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది.

1 / 6
కర్కాటకం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ధన కారకుడు గురువు బాగా యాక్టివ్ గా ఉన్నందువల్ల ఎంత ధనమైనా చేతిలో నిలవ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ ప్రయత్నాలు పెరుగుతాయి కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభ కార్యాలు నిర్వహించడానికి, దైవ కార్యాలకు డబ్బు బాగా ఖర్చవుతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకోవడం చాలా మంచిది.

2 / 6
సింహం: ఈ రాశికి అష్టమ శని జరుగుతుండడం వల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు ఖర్చు పెట్టే సూచనలున్నాయి. బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకోవడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం మంచిది.

3 / 6
వృశ్చికం: ఈ రాశివారు రెండు నెలల పాటు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన కార కుడు గురువు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం పెరగకపోవచ్చు. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు, వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలను సరిగా నిర్వహించుకోలేకపోతారు. సన్నిహితులు తప్పుదోవ పట్టించడం వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరంగా కనిపిస్తోంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి మరో రెండు నెలల పాటు భారీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహించడం, కుటుంబ ఖర్చులు బాగా పెరగడం, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడం వంటి వాటి వల్ల చేతిలో డబ్బుండని పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా మందగిస్తాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయం వృద్ది చెందకపోవచ్చు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడంతో పాటు మదుపు చేయడం మంచిది.

5 / 6
మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడంతో పాటు, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. వీరికి ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా శ్రమ ఎక్కువగా ఉండవచ్చు. ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల ఉపయోగం ఉంటుంది.

6 / 6