Horoscope Today: వారికి ఉద్యోగంలో ఊహించని పరిణామం.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Horoscope in Telugu (December 03, 2024): మేష రాశి వారికి ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా తొలగిపోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఉద్యోగంలో ఊహించని పరిణామం.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 03rd December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 03, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 3, 2024): మేష రాశి వారికి ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా తొలగిపోయే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆదాయంలో కొద్దిపాటి వృద్ధి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా తొలగిపోయే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగు లకు కంపెనీల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు కలు గుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

‍ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, ఉచిత సహాయాలు ఆపడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. పట్టుదలగా బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో యాక్టి విటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో నిలకడగా పురోగమిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత పనుల మీద దృష్టి పెడతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశముంది. ఆదాయం అనుకూలంగా ఉండడంతో ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయట పడతారు. ఆదాయ మార్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శి స్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఉండే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు వెడతాయి. స్వల్ప అనారోగ్యాలు, పనుల్లో శ్రమ, తిప్పట, పని ఒత్తిడి వంటివి ఉండే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు. జీవిత భాగస్వామికి కూడా ధన యోగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయపరంగా రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొం టారు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభించడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం వృద్ధి చెందు తుంది.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నిటినీ మొత్తం మీద పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల దశ, దిశల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తు లతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరో గ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి ఎక్కువగానే ఉంటాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభి స్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆదాయ సమస్యలుండకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తిప్పట ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువులు కొందరు బాగా ఇబ్బంది పెడతారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది.