Money Astrology: మేష రాశిలో గురు, శుక్రుల కలయిక.. వారికి ఆకస్మిక ధన లాభం పక్కా..!
ఈ నెల 25వ తేదీ నుంచి మే నెల 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మేష రాశిలో గురు, శుక్రులు కలిసి ఉంటాయి. ఇందులో గురువు దేవతల గురువు కాగా, శుక్రుడు రాక్షసుల గురువు. ఈ రెండు గ్రహాలకు మధ్య వైరం ఉన్నప్పటికీ సాధారణంగా ఇవి ఒకే రాశిలో కలిసినప్పుడు పోటాపోటీగా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.
ఈ నెల 25వ తేదీ నుంచి మే నెల 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మేష రాశిలో గురు, శుక్రులు కలిసి ఉంటాయి. ఇందులో గురువు దేవతల గురువు కాగా, శుక్రుడు రాక్షసుల గురువు. ఈ రెండు గ్రహాలకు మధ్య వైరం ఉన్నప్పటికీ సాధారణంగా ఇవి ఒకే రాశిలో కలిసినప్పుడు పోటాపోటీగా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు ధన, గృహ, వాహనాలకు సంబంధించిన గ్రహాలే కావడం వల్ల ఈ అంశాలలో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి వీటిల్లో కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది.
- మేషం: ఈ రాశిలో గురు, శుక్రులతో పాటు ఉచ్ఛ రవి కూడా కలవడం వల్ల ఈ రాశివారు తప్పకుండా అదృష్టవంతులు, యోగ జాతకులు అయ్యే అవకాశముంది. ఒక ప్రముఖ వ్యక్తిగా చెలామణి అవడం జరుగుతుంది. ఉద్యోగంలో అంచనాలకు మించి ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరో గ్యానికి ఏమాత్రం లోటుండదు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరించడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, శుక్రులు కలుసుకోవడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. లాభ స్థానానికి సంబంధించిన ఉన్నత స్థాయి పరిచయాలు, ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు, ఆరోగ్యంలో మెరుగుదల వంటివి తప్పకుండా ఈ రాశివారికి అనుభవానికి వస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు, ఇతర విభేదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం ఏర్పడే అవకాశముంది.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో గురు, రవులు కలిసి ఉండడమే ఒక విశేషం కాగా, ఈ గ్రహాలతో శుక్రుడు చేరడం మరింత విశేషం. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవు తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో అంచనాలకు మించిన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉన్నత పదవులతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టిన రాశ్యధిపతి రవితో శుక్ర, గురువులు కలిసి ఉండడం మహా భాగ్య యోగం కలిగిస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు, అనేక మార్గాల్లో ఆదా యం వృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. విదేశీ యానానికి, విదే శాల్లో ఉద్యో గాలకు ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది. ప్రజ్ఞాపాటవాలు బాగా వెలుగు లోకి వస్తాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు, శుక్రులు కలవడం ఈ రాశివారి జీవితంలో సరికొత్త సానుకూల మార్పులకు నాంది పలుకుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా సంపన్నులతో పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు లేదా క్షేత్రాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్రులు కలవడం వల్ల ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్ల మూలంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో గురు, శుక్రులు కలవడం వల్ల సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థితిగతులు పెరిగే అవకాశముంది. అప్రయత్న ధన ప్రాప్తికి, ఆకస్మిక ధన లాభానికి ఆస్కారముంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. మాతృ సౌఖ్యం లభిస్తుంది. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.