Foreign Job Astrology: గురు, రాహువుల అనుకూలత.. ఈ రాశుల వారికి విదేశీ ఉద్యోగ యోగం..!
ఏ జాతక చక్రంలో అయినా గురు, రాహువులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అదే విధంగా వ్యయ స్థానం, భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని రాశులకు గురు, రాహువుల అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరి లోగా విదేశీ సంస్థల్లో ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది.
ఏ జాతక చక్రంలో అయినా గురు, రాహువులు బలంగా ఉన్న పక్షంలో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అదే విధంగా వ్యయ స్థానం, భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొన్ని రాశులకు గురు, రాహువుల అనుకూలంగా ఉన్నం దువల్ల ఈ ఏడాది చివరి లోగా విదేశీ సంస్థల్లో ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో గురువు, వ్యయ స్థానంలో రాహువు ఉన్నందువల్ల విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశివారికి సమీప భవిష్యత్తులో విదేశీ సొమ్ము అనుభ వించే యోగం ఉంది. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలన్నీ కొద్ది ప్రయత్నంతో తొలగి పోతాయి. విదేశీ ప్రయాణం లాభసాటిగా సాగిపోతుంది. ఈ రాశివారికి విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు అక్కడే స్థిరపడడం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం వంటివి జరుగుతాయి.
- మిథునం: ఈ రాశికి రాహువు ఉద్యోగ స్థానంలో ఉండడం, గురువు వ్యయస్థానంలో ఉండడం వల్ల తప్ప కుండా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వీరికి స్వదేశీ కంపెనీల కన్నా విదేశీ కంపెనీల నుంచి ఎక్కువగా ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. విదేశాల్లో వీరు ఇబ్బడిముబ్బడిగా ఆదా యం గడించే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కలిసి రావడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాహువు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా విదేశీ యాన యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు, ఉద్యోగులు విదేశీ అవకాశాలను పొందగలుగుతారు. ఇప్పటికే విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఏర్పడుతుంది. తప్పకుండా విదేశీ సొమ్ము అనుభవించే యోగంపడుతుంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి గురు, రాహువులు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల విదేశీ ప్రయా ణాలకు బాగా అవకాశం ఉంది. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమై వీరు తప్పకుండా ఉద్యోగ కారణాలపై విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయ త్నంతో విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల కోసం కూడా విదేశాలకు వెళ్లి, స్థిరపడే అవకాశం ఉంది. గ్రహ బలం కారణంగా విదేశాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ కోణంలో రాహువు సంచారం, సప్తమంలో గురు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాకుండా చదువుల నిమిత్తం కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో వీరు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుని ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశాల్లో కోరుకున్న ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. విదేశాలకు ఈ సమయం వెళ్లే వారు అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- మకరం: ఈ రాశికి ప్రస్తుతం గురు, రాహువులు బాగా అనుకూల స్థానాల్లో ఉన్నందువల్ల నిరుద్యోగులకు విదేశాల నుంచి ఎక్కువగా అవకాశాలు అందుతాయి. ఉద్యోగులకు కూడా విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. హోదాతో పాటు, భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్లినవారు స్థిరమైన ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయి.