Astrology: గ్రహ రాజు రవి పూర్ణ బలం.. ఈ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
ప్రస్తుతం స్వస్థానమైన సింహ రాశిలో సంచారం చేస్తున్న గ్రహ రాజు రవి అక్టోబర్ 16 వరకు పూర్ణ బలంతో ఫలితాలనివ్వబోతున్నాడు. రవి గ్రహానికి స్వస్థానంలో ఉన్నప్పుడే కాకుండా, కన్యా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా బలం పట్టడం జరుగుతుంది. ప్రభుత్వం, అధికారం, గుర్తింపు, ఉన్నత స్థాయి, తండ్రి, సంపద, ప్రాధాన్యాలకు కారకుడైన రవికి బలం పట్టినప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం స్వస్థానమైన సింహ రాశిలో సంచారం చేస్తున్న గ్రహ రాజు రవి అక్టోబర్ 16 వరకు పూర్ణ బలంతో ఫలితాలనివ్వబోతున్నాడు. రవి గ్రహానికి స్వస్థానంలో ఉన్నప్పుడే కాకుండా, కన్యా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కూడా బలం పట్టడం జరుగుతుంది. ప్రభుత్వం, అధికారం, గుర్తింపు, ఉన్నత స్థాయి, తండ్రి, సంపద, ప్రాధాన్యాలకు కారకుడైన రవికి బలం పట్టినప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుత బలం వల్ల రవి మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు అధికారాన్ని, ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశివారికి అత్యంత శుభుడైన రవికి బలం పెరుగుతున్నందువల్ల ప్రభుత్వపరమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వంలో గానీ ఉద్యోగం కోరుకుంటున్నవారి కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం కావ డంతో పాటు పదోన్నతికి, వేతనాల పెరుగుదలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు అతి చిన్న ప్రయత్నంతో ప్రాధాన్యమున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- వృషభం: ఈ రాశికి చతుర్థ స్థాన అధిపతిగా అత్యంత శుభుడైన రవి బలం పెరిగిన కారణంగా ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి రావడం జరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడం వల్ల, ఆశించినంతగా ఆదాయం వృద్ధి చెందడం వల్ల ముఖ్య మైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి సొంత రాశితో పాటు ధన స్థానంలో కూడా సంచారం చేస్తున్నందు వల్ల ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో రవి సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండక పోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం లభి స్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతానయోగానికి అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రవి సంచారం వల్ల ప్రభుత్వంనుంచి ఆశించిన గుర్తింపు లభి స్తుంది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది. ఊహించని విధంగా పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూ లంగా పరిష్కారం అవు తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందుతాయి.
- మకరం: ఈ రాశికి రవి అనుకూల సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవు తాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విదేశీ అవకాశాలు అందడం జరుగుతుంది.