Astrology: మగ బిడ్డా.? ఆడ బిడ్డా.? మీ రాశి ఆధారంగా మీ సంతానం ఏంటో తెలుసుకోండి.

| Edited By: Narender Vaitla

Jul 21, 2023 | 7:27 PM

సాధారణంగా ఏ రాశుల వారికి ఏ సంతానం కలిగే అవకాశం ఉంటుందన్నది ఆసక్తి కలిగించే విషయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులు పురుష రాశులు కాగా మరికొన్ని రాశులు స్త్రీ రాశులు. గురు, కుజ, రవి గ్రహాలను బట్టి పురుష సంతానమని, శుక్ర, చంద్ర, బుధ గ్రహాలను బట్టి స్త్రీ సంతానమని నిర్ధారించడం జరుగుతుంది. శని రాహు, కేతువులను బట్టి కవలలు లేదా స్త్రీ పురుష సంతానంలో

Astrology: మగ బిడ్డా.? ఆడ బిడ్డా.? మీ రాశి ఆధారంగా మీ సంతానం ఏంటో తెలుసుకోండి.
Zodiac Sign
Follow us on

సాధారణంగా ఏ రాశుల వారికి ఏ సంతానం కలిగే అవకాశం ఉంటుందన్నది ఆసక్తి కలిగించే విషయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులు పురుష రాశులు కాగా మరికొన్ని రాశులు స్త్రీ రాశులు. గురు, కుజ, రవి గ్రహాలను బట్టి పురుష సంతానమని, శుక్ర, చంద్ర, బుధ గ్రహాలను బట్టి స్త్రీ సంతానమని నిర్ధారించడం జరుగుతుంది. శని రాహు, కేతువులను బట్టి కవలలు లేదా స్త్రీ పురుష సంతానంలో ఎవరో ఒకరు అని చెప్ప వలసి ఉంటుంది. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎటువంటి సంతానం కలిగే అవకాశం ఉందో ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం:

మేష రాశి పురుష రాశి. ఈ రాశిలో పురుష గ్రహ మైన గురువు సంచరిస్తున్నందువల్ల సాధార ణంగా పురుష సంతానం కలిగే అవకాశం ఎక్కు వగా ఉంది. ఈ రాశి వారికి పుత్రస్థానాధిపతి రవి అయినందువల్ల ఉత్తర సంతానం కలిగే అవకా శమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ గురు గ్రహం వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు మేష రాశిలోనే సంచరిస్తున్నందువల్ల ఈ లోపున ప్రసవించే వారికి తప్పకుండా పురుష సంతానం కలుగుతుందని చెప్పవచ్చు.

వృషభం:

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇది స్త్రీ గ్రహం అయినందువల్ల, ఈ గ్రహం స్త్రీ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల తప్పకుండా స్త్రీ సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. సాధారణంగా వృషభ లగ్నానికి లేదా వృషభ రాశికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదటి సంతానం స్త్రీ సంతానం కావడం కూడా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం:

సాధారణంగా మిధున రాశి వారికి కవలలు కలగటం జరుగుతుంటుంది. ఈ రాశి ద్విస్వభావ రాశి అయినందువల్ల స్త్రీ, పురుషుల్లో ఎవరో ఒకరు కలిగే అవకాశం కూడా ఉంది. అయితే, పుత్ర స్థానాన్ని గురుడు వీక్షిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. పుత్ర స్థానమైన పంచమ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా ఇందుకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రాశికి పుత్ర స్థానాధిపతి అయిన కుజుడు పురుష రాశి అయిన సింహంలో సంచరిస్తు న్నందు వల్ల పుత్ర సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఈ రాశిలో రవిగ్రహ సంచారం కూడా జరుగుతున్నందువల్ల పురుష సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. మరో మూడు నెలల పాటు రవి, కుజ గ్రహాలు పురుషరాశిలోనే సంచరించడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.

సింహం:

ప్రస్తుతం ఈ రాశిలో కుజ బుధ సంచారం జరుగుతుండటం, పుత్రస్థానాన్ని గురు గ్రహం వీక్షించడం వంటి కారణాలవల్ల ఈ రాశి వారికి తప్పకుండా పురుష సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి నాథుడైన రవి గ్రహం ప్రస్తుతం కర్కాటకంలో సంచరించడం కూడా ఇందుకు అవకాశం ఇస్తోంది. ఈ ఏడాది చివరిలోగా సింహ రాశి వారికి పురుష సంతానం కలిగే అవకాశం ఉంది.

కన్య:

ఈ రాశి నాధుడైన బుధ గ్రహం ఎక్కువగా స్త్రీ సంతానాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పురుష గ్రహాలు ఏవీ అనుకూలంగా లేనందు వల్ల, పంచమ స్థానాన్ని శుక్ర గ్రహం వీక్షించబోతు న్నందువల్ల ఈ రాశి వారికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రెండు మూడు నెలల్లో స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి వారికి మొదటి సంతానం స్త్రీ సంతానం అయి ఉంటుంది.

తుల:

ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్త్రీ గ్రహమే అయినప్పటికీ ఈ రాశికి ప్రస్తుతం పురుష గ్రహాలైన గురువు రవి కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పురుష సంతానం కలిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా గురువు బలంగా ఉన్న పక్షంలో పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రస్థానాన్ని కుజ గ్రహం వీక్షించడం వల్ల కూడా పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈ రాశికి అధిపతి అయిన కుజుడు పురుష గ్రహం అయినందువల్ల, పుత్ర స్థానాధిపతి అయిన గురుగ్రహం పురుష రాశి అయిన మేషంలో సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది తప్పకుండా పురుష సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. పురుష గ్రహాలయిన కుజ, రవి గ్రహాలు కూడా ఆధిపత్యం లో ఉన్నందువల్ల ఈ రాశి వారికి కొద్దికాలంలో పురుష సంతాన యోగం ఉందని చెప్పవచ్చు.

ధనుస్సు:

ఈ రాశికి అధిపతి అయిన గురుగ్రహం పుత్ర స్థానంలో ఉన్నందువల్ల, పురుష గ్రహాలైన కుజ, రవి గ్రహాలు భాగ్యస్థానంలో సంచరిస్తున్నందు వల్ల, స్త్రీ గ్రహాలు అనుకూలంగా లేనందు వల్ల ఈ రాశి వారికి పురుష సంతాన యోగం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 లోపల వీరికి పురుష సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. పుత్ర స్థానంలో గురుగ్రహ సంచారం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

మకరం:

ఈ రాశికి పంచమ స్థానాధిపతి లేదా పుత్రస్థానాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ, మకరాన్ని వీక్షించడం వల్ల, శుక్రుడు స్త్రీ గ్రహం కావడం వల్ల, పురుష గ్రహాలైన గురు, కుజ, రవులు, అనుకూలంగా లేనందు వల్ల స్త్రీ సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. నవంబర్ నెల లోపల ప్రసవానికి అవకాశం ఉన్న పక్షంలో తప్పకుండా స్త్రీ సంతానం కలగడం జరుగుతుంది.

కుంభం:

ఈ రాశికి పుత్రస్థానాధిపతి అయిన బుధ గ్రహం సప్తమ స్థానంలో రవి కుజ గ్రహాలతో కలిసి ఉండటం వల్ల ఈ రాశి వారికి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి నాధుడైన శనీశ్వరుడు స్వక్షేత్రంలో సంచరిస్తూ పుత్ర కారకుడైన గురు గ్రహాన్ని పుత్రస్థానాధిపతి అయిన బుధ గ్రహాన్ని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా పుత్ర సంతానం మాత్రమే కలిగే అవకాశం ఉంది.

మీనం:

ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో గురుగ్రహం సంచరించడం, పంచమ స్థానంలో వక్రగతిలో ఉన్న శుక్ర గ్రహం ప్రవేశించడం వల్ల కవలలు కలిగే అవకాశం ఉంది. శుక్ర గ్రహం కాస్తంత బలంగా ఉన్నందువల్ల స్త్రీ సంతానం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా ప్రసవం జరిగే పక్షంలో కవలలు లేదా స్త్రీ సంతానం కలగటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని రాశి ఫలాల వార్తల కోసం క్లిక్ చేయండి..