Donkey Dream Meanings: కలలో గాడిద.. శుభమా అశుభమా? అలా కనిపిస్తే ప్రేమను కోల్పోతారా..?
Donkey Deam Meaning: కలలో గాడిద కనిపించడం సాధారణంగా మంచిది కాదు, అవగాహన లేకపోవడాన్ని, రాబోయే చికాకులను సూచిస్తుంది. భారం మోస్తున్న గాడిదను చూస్తే ఓపికతో కష్టపడితే విజయం. గాడిదపై నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యం. తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యకలాపాల భయం. గాడిదపై ఊరేగుతూ ఇతరులు వెంబడించటం నాయకత్వ లక్షణాలను, ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది.

Donkey In Dreams: సాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో ఏవేవో కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని వస్తువులు, జంతువులు లాంటివి కనిపిస్తుంటాయి. మన కలల్లో వచ్చేది మనం తరచూ ఆలోచించేవి కూడా కావచ్చు. అందుకే మన కలలు మన మానసిక స్థితికి సంకేతాలు పంపుతాయని స్వాప్నిక శాస్త్రం చెబుతుంది. కలలో కొన్ని జంతువులు కనిపిస్తే శుభ ఫలితాలు.. మరికొన్ని కనిపిస్తే ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం ఉందని చెబుతుంటారు. ఇప్పుడు మనం గాడిద కలలోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. కలలో గాద కనిపించడం సాధారణంగా మంచి ఫలితాలను సూచించదు. ఇది జీవితంలో స్పష్టమైన అవగాహన లేకపోవడాన్ని, అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే అనేక చిక్కులను తెలియజేస్తుంది. అయితే, కలలోని సందర్భాన్ని బట్టి దీని అర్థం మారుతుంది.
గాడిద కలలోకి వస్తే..
మీ కలలో బరువును మోస్తున్న గాడిదను చూసినట్లయితే.. మీరు చాలా సహనంతో, కష్టపడి పనిచేసిన తర్వాతే వ్యాపారంలో కానీ, ప్రేమ సంబంధాలలో కానీ విజయం సాధిస్తారని అర్థం. గాడిద మొండితనానికి, ఇతరులకు లొంగని స్వభావానికి ప్రతీక. ఒకవేళ మీరు కలలో గాడిదపై నుంచి పడిపోతున్నట్లు చూస్తే.. ఇది ప్రేమలో వైఫల్యాన్ని సూచిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
గాడి తన్నినట్లు కనిపిస్తే..
గాడిద తన్నినట్లు కల వస్తే, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పట్టుబడతామేమో అనే భయం మీ మనసులో ఉందని అర్థం. దీనికి విరుద్ధంగా, మీరు గాడిదపై ఊరేగుతూ, దాని వెనుక చాలామంది వస్తున్నట్లు కలలో చూస్తే.. మీకు ఇతరులను ఒప్పించగల నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, త్వరలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని, వ్యాపారంలో పదోన్నతులు పొందుతారని లేదా విద్యార్థులు చక్కటి మార్కులతో విజయం సాధిస్తారని సూచిస్తుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
