ఏ రాశివారు ఏ వేలికి గోల్డ్ రింగ్ ధరించాలో తెలుసా? ఇలా చేస్తే అదృష్టం మీవెంటే
Gold Ring: బంగారం కేవలం విలువైన లోహం మాత్రమే కాదు; జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం బంగారు ఉంగరాన్ని సరైన విధానంలో ధరిస్తే ధనం, అదృష్టం, విజయాలు లభిస్తాయి. అయితే తప్పు పద్ధతిలో ధరించినప్పుడు ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బంగారు ఉంగరాన్ని ధరించేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు, ఏ వేలుకు ధరించాలి వంటి విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చేతికి ఉంగరాలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంది. ఆయా వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని లోహాలు, రత్నాలను సూచిస్తుంది. అందుకే చాలా మంది బంగారం, వెండి, ఇతర ఖరీదైన లోహాలు, రత్నాలు పొదిగిన ఉంగరాలను ధరిస్తుంటారు. బంగారం ఒక విలువైన లోహం మాత్రమే కాదు.. జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీనికి విశేషమైన ప్రాధాన్యం ఉంది.
బంగారు ఉంగరాన్ని సరైన విధంగా ధరిస్తే ధనం, అదృష్టం, విజయాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. అదే తప్పు విధానంలో ధరిస్తే ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. అందుకే బంగారు ఉంగరాన్ని ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ఏ వేలుకు ధరించాలి వంటి విషయాలను తెలుసుకోవడం అవసరం.
బంగారు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలి?
శాస్త్రం ప్రకారం.. బంగారు ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరించడం శుభప్రదం. ఇలా ధరిస్తే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి, దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కొన్ని సందర్భాల్లో చిటికెన వేలుకు ధరించినా మంచి ఫలితాలు లభిస్తాయి. మధ్య వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించకూడదు. అలా చేస్తే ధననష్టం, ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బొటనవేలు చంద్రగ్రహానికి సూచిక కావడంతో ఆ వేలుకూ బంగారు ఉంగరాన్ని ధరించడం మంచిది కాదు.
బంగారం ఎప్పుడు ధరించాలి?
ఆదివారం, బుధవారం, శుక్రవారం రోజులు బంగారం ధరించడానికి అనుకూలంగా భావిస్తారు. అలాగే గురుగ్రహానికి సంబంధించిన గురువారం కూడా బంగారు ఉంగరం ధరించడానికి ఉత్తమమైన రోజు.
బంగారు ఉంగరాన్ని ఎలా ధరించాలి?
బంగారు ఉంగరాన్ని గంగాజలం, పాలు, తేనెతో శుద్ధి చేసి, విష్ణుమూర్తి ఎదుట ఉంచి పూజ చేసిన అనంతరం ధరిస్తే శుభఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
బంగారం ఏ రాశుల వారికి అనుకూలమంటే?
మేషం, కర్కాటకం, సింహం, ధనస్సు, మీన రాశులకు బంగారం మంచి ఫలితాలను ఇస్తుంది.
వీరికి మాత్రం బంగారం అంత అనుకూలం కాదు
మకరం, మిథునం, కుంభం, వృషభం రాశుల వారికి బంగారం సాధారణంగా అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ బంగారం ధరించేముందు జాతకంలో గురుగ్రహ స్థితిని పరిశీలించి, జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గ్రహాలతో బంగారానికి సంబంధం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారానికి గురుగ్రహంతో బలమైన సంబంధం ఉంది. బంగారం ధరించడం వల్ల జాతకంలో గురుగ్రహం బలపడుతుంది. గురుగ్రహం బలపడితే ధనలాభం, శుభకార్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయి. జీవితం ఆనందంగా మారుతుంది. అలాగే కొన్ని జ్యోతిష్య గ్రంథాల ప్రకారం బంగారం సూర్యగ్రహాన్ని కూడా బలపరుస్తుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసం, ధైర్యం, శక్తికి సంకేతం. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే వ్యక్తిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
బంగారం లక్ష్మీ స్వరూపం
అంతేగాక, బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. బంగారం ధరించడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు. అయితే ప్రతి రాశికి బంగారం ఒకే విధంగా అనుకూలంగా ఉండకపోవచ్చు.
