AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రోజులో ఇంత మార్పా..? సోమవారం నాటి రాశిఫలాలు ఇక్కడ చూడండి..

నేటి రాశిఫలాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు పలు రాశుల వారికి ఆర్థికంగా పురోగతి, ఉద్యోగ అవకాశాలు, ఆస్తి వివాదాల పరిష్కారం, శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. కొందరికి అనుకోని ధనప్రాప్తి, ప్రమోషన్, పెళ్లి సంబంధాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.

ఒక్క రోజులో ఇంత మార్పా..? సోమవారం నాటి రాశిఫలాలు ఇక్కడ చూడండి..
Day Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2026 | 9:57 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా దృష్టి పెడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది. మిత్రులు, సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇరుగు పొరుగు వారి వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవు తాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది.  ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యు లతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురో గమిస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పిల్ల లకు సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. మిత్రులతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురో గతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాల విషయంలో మరింత పట్టుదలగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది కలిగిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరు గుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం విషయంలో శుభవార్త లందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపంచేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావ రణం ఉంటుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా పురోగతి ఉంటుంది. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. రాదను కున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపా రాల్లో పెట్టుబడులు లాభిస్తాయి.  అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరు గుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు నిదానంగా పురోగ మిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు విలువ పెరుగు తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. రోజంతా ప్రశాంతంగా, ఆనం దంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ ఏర్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం మెరు గుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాల వల్ల పలుకుబడి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమ యం అనుకూలంగా ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదని పిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Follow Us
నేటి రాశిఫలాలు ఇక్కడ చదవండి..
నేటి రాశిఫలాలు ఇక్కడ చదవండి..
దేవుడిని దర్శించుకునే ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పురాణాల్లో
దేవుడిని దర్శించుకునే ముందు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పురాణాల్లో
అడవికి శాపం.. వెళ్తే తిరిగి రాలేదు.. ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్
అడవికి శాపం.. వెళ్తే తిరిగి రాలేదు.. ఓటీటీని ఊపేస్తున్న థ్రిల్లర్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇంటర్‌ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు!
వర్షాల కోసం తెలంగాణ సర్కార్ మహా వరుణ యాగం
వర్షాల కోసం తెలంగాణ సర్కార్ మహా వరుణ యాగం
ధీరజ్ గుండె ముక్కలు చేసిన ప్రేమ.. భద్రావతితో వల్లి కుట్రలు..
ధీరజ్ గుండె ముక్కలు చేసిన ప్రేమ.. భద్రావతితో వల్లి కుట్రలు..
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
సచిన్, విరాట్ కాదు.. ప్రపంచంలోనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అతడే..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఉదయం తలుపులు తెరిచేసరికి పూజ..
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!