AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్..

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు ఓటీటీలో ఒక మలయాళీ థ్రిల్లర్ డ్రామా అందరిని కట్టిపడేస్తుంది. ఒక శాపగ్రస్త అడవి నేపథ్యంలో సాగే ఈ రహస్యమాయ కథ ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి సన్నివేశంలోని ఉత్కంఠభరితమైన మలుపులతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రానికి రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది.

Cinema : 2 గంటలు అరాచకం.. ప్రతి నిమిషం ఊహించని మలుపులు.. ఓటీటీని ఊపేస్తున్న మలయాళీ థ్రిల్లర్..
Sambhavam Adhyayam Onnu
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2026 | 9:38 AM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మంది థియేటర్లలో కంటే ఇంట్లోనే అందరితో కలిసి సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య మరింత పెరిగింది. అలాగే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని జానర్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సినిమా వరుస మలుపులతో ప్రతి సన్నివేశం మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. 2 గంటల 9 నిమిషాల పూర్తి వినోదం ఖాయం. జీతూ సతీష్‌మన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ‘సంభవం ఎపిసోడ్ వన్’ చిత్రం 2026 మార్చిలో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఇందులో నీతూ కృష్ణ, అస్గర్ అలీ, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ అటు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

ఈ కథ కేరళ-తమిళనాడు సరిహద్దులోని వెల్లూర్‌కట్టైలో ఉన్న ఒక శాపగ్రస్త అడవి నేపథ్యంలో సాగుతుంది. తప్పిపోయిన తమ సహోద్యోగులను వెతుకుతూ ముగ్గురు పోలీసు అధికారులు ఆ అడవిలోకి ప్రవేశిస్తారు. సినిమా కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత, వారికి ఒక శవం దొరుకుతుంది. ఇక్కడి నుండి, నిమిష నిమిషానికి కొత్త మలుపులతో కథ ముందుకు సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ‘సంభవం ఎపిసోడ్ వన్’ జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి IMDBలో 7.3 రేటింగ్ ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఈ చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ నవీన్ నజోస్, ఎడిటర్ అర్జున్ ప్రకాష్ , సంగీత దర్శకుడు గాడ్విన్ థామస్ ఉన్నారు. దీనిని నల్లసినిమా ప్రొడక్షన్స్ బ్యానర్ క్రింద ఫరాస్ మహమ్మద్, ఫహద్ సిద్ధీఖ్ , ఫయేజ్ మహమ్మద్ నిర్మించారు. ‘సంభవం అధ్యాయం ఒన్ను’ నిజానికి, జితు గతంలో తీసిన ‘సంభవం’ అనే లఘు చిత్రానికి కొనసాగింపు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us