Rasi Phalalu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులవారికి సోమవారం దిన ఫలాలు ఇదిగో..
Horoscope Today: సోమవారం 12 రాశుల వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొందరికి పురోగతి, మరికొందరికి అదనపు బాధ్యతలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహం, మకరం రాశుల వారికి ఆకస్మిక ధనలాభ యోగం కనిపిస్తుండగా, కర్కాటకం, మీనం రాశుల వారికి ఉద్యోగ, కుటుంబ విషయాల్లో శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి.

దిన ఫలాలు -జూలై 20, 2026 : మేషం రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. వృషభం రాశి వారికి బాధ్యతల కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ, తిప్పట ఉంటాయి. మిథునం రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు బలం ఎక్కువగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సాగిస్తూనే ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొందరు మిత్రుల నుంచి విశేషాలు వింటారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయా ణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
బాధ్యతల కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ద్వితీయ స్థానంలో గురు బలం ఎక్కువగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సాగిస్తూనే ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. భాగ స్వామ్య వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొద్దిపాటి ధన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాదను కుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వాద వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగపరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. అయితే, ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకా లంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యవహార జయం ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందు వల్ల కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయం పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మధ్యవర్తుల జోక్యంతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇతరులకు అనేక విధాలుగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరగడంతోపాటు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నా లకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగుల ప్రతిభకు, సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పనుల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
గురు బలం అనుకూలంగా ఉంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.