Cinema: మనుషులను దారుణంగా చంపేసి శవాలతో పెయింటింగ్.. నగరంలో సైకో కిల్లర్.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఓటీటీలో ఓ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అందుబాటులో ఉంది. వణుకుపుట్టించే సీన్స్, మతిపోగొట్టే మలుపులతో సాగుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా ప్రేక్షకులకు భయం పుట్టిస్తుంది. మనుషులను దారుణంగా చంపేసి ఆ శవాలను పెయింటింగ్ గా మార్చే సైకో కిల్లర్ కథే ఇదే.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ జానర్ చిత్రాలకు ఎల్లప్పుడు ప్రజాదరణ పొందుతాయి. అందుకే ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచే కథలకు మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి సినిమాలలో, ఇటీవల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘M4M: మోటివ్ ఫర్ మర్డర్’. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా సందడి చేయనప్పటికీ, ఇప్పుడు ఇది మరోసారి ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో అమెరికన్ నటి జో శర్మ , సంబిత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. హైదరాబాద్ నగరాన్ని భయపెడుతున్న వరుస హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఇవి సాధారణ హత్యలు కావు. మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా మార్చేసి.. పెయింటింగ్ చేస్తుంటాడు సైకో కిల్లర్. దీంతో ఈ కేసును మరింత కష్టంగా మారుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
ఇదిలా ఈ కేసును పరిష్కరించే బాధ్యత ఏసీపీ కృష్ణ, పరిశోధనాత్మక జర్నలిస్ట్ రాధ మీద పడుతుంది. ప్రతి హత్య వెనుక ఒక సందేశం ఉండటం, కొత్త అనుమానాలకు దారితీసే ప్రతి ఆధారం, కథలోని పాత్రల గతం వెల్లడి కావడం వంటి అంశాలు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. ముఖ్యంగా, హంతకుడు ఎవరు? ఈ ఘోరాల వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ప్రేక్షకులు చివరి వరకు వేచి ఉండాల్సిందే. దర్శకుడు కథను మలుపులతో నింపేయడం ఈ సినిమాకు ప్రధాన బలం అనే చెప్పాలి.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
థియేటర్లలో విడుదలైనప్పుడు మంచి రివ్యూస్ అందుకున్నప్పటికీ, ప్రచారం లేకపోవడం వల్ల ఇది పెద్దగా వసూళ్లు చేయలేదు. అయితే, దీని కంటెంట్‌కు ప్రశంసలు లభించాయి. IMDBలో కూడా మంచి రేటింగ్‌లు పొందిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..
