అక్టోబర్ 29 రాశిఫలాలు: ఉద్యోగం, ఆదాయం విషయాల్లో వారికి గుడ్న్యూస్
Horoscope Today (October 29, 2026): గురువారం నాటి రాశిఫలాల్లో కొన్ని రాశుల వారికి శుభవార్తలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, మిథున రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. మరి మిగతా 9 రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (అక్టోబర్ 29, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. మిథున రాశికి చెందిన ఏ రంగానికి చెందినవారికైనా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పంచమ స్థానంలో గురువు, సప్తమంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటప డతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
షష్ట స్థానంలోనే అయినప్పటికీ రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఏ పనైనా సజావుగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలు పండి స్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు పంచమంలో బాగా బలంగా ఉన్నందువల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ రంగానికి చెందినవారికైనా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టి ఆర్థిక లాభాలను పొందుతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితముంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక విష యాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యో గాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుక్ర, బుధుల అనుకూలత వల్ల అనుకోకుండా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆదాయానికి లోటుం డదు. కుటుంబ జీవితం సామరస్యంగా, సంతృప్తికరంగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రాశ్యధిపతి కుజుడు గురువుతో కలిసి భాగ్య స్థానంలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక పరి స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్త వుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు ప్రవేశ పెడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి ఈ రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచి పోతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొన్నిఅనుకూల ఫలితాలనిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శుక్ర, శని, బుధ, రవి గ్రహాల అనుకూలత వల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆర్థికంగా మోసపోయే సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. ఇంటా బయటా బాధ్య తలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిలక డగా సాగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు, వాగ్దానాలు పెట్టుకోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువుతో పాటు కుజ, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసివస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి.



