AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 12 దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!

Horoscope Today (November 12, 2026): గురువారం రోజున గ్రహాల సంచారం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కొందరికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తే, మరికొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపించనుంది. ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది? ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురుకానున్నాయి? తెలుసుకోండి.

నవంబర్ 12 దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
Rasi Phalalu 12 Nov 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2026 | 6:00 AM

Share

దినఫలాలు (నవంబర్ 12, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతల్ని నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశిం చిన లాభాలు పొందుతారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబం ధించి కంపెనీల నుంచి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతల్ని నెరవేరుస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఇంటికి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడిని తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. వ్యక్తి గత సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతారు. స్వల్ప అనారోగ్యం కూడా బాధి స్తుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వా మితో కలిసి షాపింగ్ చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ పెద్దల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యమవుతాయి. స్వల్ప అనారోగ్యాలు, పనుల్లో శ్రమ, తిప్పట, పని ఒత్తిడి వంటివి ఉంటూ ఉంటాయి. ఉద్యోగంలో అధికా రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిదానంగా పురోగమిస్తాయి. జీవిత భాగ స్వామికి అదృష్టం పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే పరి స్థితిలో ఉంటారు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి రోజంతా బాగానే గడిచిపోతుంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల వల్ల ఒక వివాదం బాగా తేలికగా పరిష్కారమవుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. రోజంతా సాను కూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో మీ నిర్ణయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు వేగంగా, చురుకుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్య కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కూడా క్షణం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వ్యక్తిగత పనులు వాయిదా పడతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. బంధుమిత్రుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబసమేతంగా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణంగా ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు సవ్యంగా సాగకపోవచ్చు. మానసిక ఒత్తిడి తప్పక పోవచ్చు. ఆదాయ సమస్యలుండే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కుటుంబపరమైన చికాకులుంటాయి. అనారోగ్యానికి అవకాశం ఉంది. బంధువులు అపనిందలు వేస్తారు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.

Follow Us
గురువారం శివకేశవులను ఇలా పూజిస్తున్నారా? సిరిసంపదలు కలుగుతాయట!
గురువారం శివకేశవులను ఇలా పూజిస్తున్నారా? సిరిసంపదలు కలుగుతాయట!
దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి