జూన్ 28 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. మీ రాశి ఫలితం ఎలా ఉంది?
దిన ఫలాలు (జూన్ 28, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను అందించనుంది. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉండగా, వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి గౌరవం, గుర్తింపు పెరగనున్నాయి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారి ఈరోజు ఫలితాలను తెలుసుకోండి.

దిన ఫలాలు (జూన్ 28, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. మిథున రాశి వారి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ధన స్థానంలో రవి, తృతీయ స్థానంలో గురు, బుధ, శుక్రుల సంచారం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. కుటుంబ విషయాల్లో బంధువులు జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో సంతృప్తికర సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో శుక్ర, బుధ, గురు గ్రహాల సంచారం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తు లకు సంబంధించిన కొన్ని అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశికి దశమంలో రవి, లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో సహా మూడు శుభ గ్రహాల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
భాగ్య స్థానంలో రవి, దశమ స్థానంలో బుధ, శుక్ర, గురువుల అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చురుకుగా ముందుకు వెడతాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. కొత్త ప్రయత్నాలకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా పురోగమిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
భాగ్య స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. హోదా లభించే అవకాశం ఉంది. అధికారులు కొత్త బాధ్యతల్ని అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రవి, కుజ, రాహు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. కొందరు మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు మోసపోవడం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గురు, శుక్ర, శని, బుధుల బలం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహ కాలు అందుతాయి. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి వ్యాపారమైనా చాలావరకు లాభాల బాటలో సాగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రవి, కుజుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు



