Horoscope Today: 12 రాశులవారికి గురువారంనాటి రాశిఫలాలు.. వారి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి..!

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 17, 2023న(గురువారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: 12 రాశులవారికి గురువారంనాటి రాశిఫలాలు.. వారి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి..!
Horoscope 17th August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 17, 2023 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయ ప్రయత్నాలు కలసి రావడం ప్రారంభిస్తాయి. ఇంటా బయటా యాక్టివిటీ బాగా పెరిగి పోతుంది. సంపాదనలో తోబుట్టువుల కంటే ఒక అడుగు ముందుంటారు. బంధువులలో ఒకరికి శుభ కార్యం కో‍సం సహాయం చేయాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరి స్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి, ఆశించిన ప్రయోజనాలు పొందు తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగపరంగా ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ, అనవసర ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఇంట్లోని వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తరగడమంటూ ఉండదు. ఖర్చులు కూడా తగ్గించుకోవడం జరుగుతుంది. అదనపు సంపాదనను మదుపు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశా జనకంగా ముందుకు వెడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో అవస్థలు పడుతున్నవారికి సైతం కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇతరుల పనుల మీద కంటే సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాల్లో స్తంభన ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తలెత్త కుండా చూసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ మొత్తం మీద సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అయితే, పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ సభ్యుల సహకారా లతో పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలను అందుకుం టారు. వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొందరిని అతిగా నమ్మడం వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సవ్యంగా సాగి పోతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కొ్ందరు బంధుమిత్రులకు మితిమీరిన ఔదార్యంతో సహాయం చేస్తారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, ఆశాజనకంగా కొనసాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట): ఆదాయ, వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఇతరుల బాధ్యతలు నెత్తిన వేసుకోకపోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. నిరు ద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం పెరుగు తుంది. ఆదాయపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి సంపాదన పెరుగు తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో ఆల యాల సందర్శన చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరు విశేషమైన పురోగతి సాధిస్తారు. వ్యక్తిగతంగా ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఆదాయం పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. సహోద్యోగులతో సమానంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలోని కొందరు ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట