Bhishma Ekadashi 2024: భీష్మ ఏకాదశి రోజున రెండు యోగాలు.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే
ఈ ఏడాది ఏకాదశి తిథి ఈ రోజు ఉదయం 8:49 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 20, 2024 మంగళవారం ఉదయం 9:55 గంటలకు ముగుస్తుంది. భీష్ముడికి మోక్షం ప్రసాదించే రోజుగా భావిస్తారు. అంతేకాదు భీష్మ ఏకాదశిన ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం వంటి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగం నాలుగు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయంలో ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి తేదీని భీష్మ ఏకాదశిని, జయ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ ఏడాది ఏకాదశి తిథి ఈ రోజు ఉదయం 8:49 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 20, 2024 మంగళవారం ఉదయం 9:55 గంటలకు ముగుస్తుంది. భీష్ముడికి మోక్షం ప్రసాదించే రోజుగా భావిస్తారు. అంతేకాదు భీష్మ ఏకాదశిన ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం వంటి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగం నాలుగు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు భీష్మ ఏకాదశి నుంచి అదృష్టం సొంతం అవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలన్నీ దూరమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమికులు తమ ప్రేమని సక్సెస్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
తుల రాశి: ఈ రాశికి చెందిన వారికీ సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్టులు, వ్యాపారుస్తులు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలతో గడుపుతారు.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై భీష్మ ఏకాదశి నుంచి విష్ణువు అనుగ్రహం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. భారీ మొత్తంలో డబ్బులు పొందుతారు. లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది.
సింహ రాశి: భీష్మ ఏకాదశి నుంచి ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుభాలను తెస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడులతో లాభాలు పొందుతారు. వ్యాపార రంగంలో మరింత విస్తరిస్తారు. ఉద్యోగ చేసే వారికి సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ అద్భుతంగా సాగుతుంది. వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు