Hadaka Matsuri: ఆ దేశంలో పెరిగిన వృద్ధ జనాభా.. అంతరించే దశలో వెయ్యి ఏళ్లకు పైగా సాగిన నగ్నోత్సవం

జపాన్‌లో ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచిన మునుపటి తరం ప్రజలు ఇప్పుడు వృద్ధులయ్యారు. పది శతాబ్దాలుగా యువత ఉత్సాహంగా జరుపుకున్న హడక మత్సూరి పండుగ ఇప్పుడు వృద్ధాప్యంతో అంతరించిపోయే దశకు చేరుకుంటుంది. ఒక నివేదిక ప్రకారం ఈసారి జపాన్‌లో జరుపుకునే షిప్ మత్సూరి పండుగ అంటే న్యూడ్ ఫెస్టివల్ ఇదే చివరి సారి అని తెలుస్తోంది. జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోని ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని అడవిలోని కొకుసేకి-జి ఆలయంలో జరిగిన హడకా మత్సూరి లేదా సోమిన్ సాయి ఉత్సవంలో వందలాది మంది యువకులు ఎక్కువగా నగ్నంగా పాల్గొన్నారు.

Hadaka Matsuri: ఆ దేశంలో పెరిగిన వృద్ధ జనాభా.. అంతరించే దశలో వెయ్యి ఏళ్లకు పైగా సాగిన నగ్నోత్సవం
Japan Naked Festival
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2024 | 12:27 PM

గత వెయ్యి సంవత్సరాలుగా జపాన్‌లో జరుపుకునే నగ్నోత్సవం అంతరించిపోయే దశలో ఉంది. కారణం తెలిస్తే షాక్ తింటారు. జపాన్‌లో ఈ పండుగలో పాల్గొనడానికి ధైర్యం చేసే యువకుల సంఖ్య చాలా తక్కువ అయిపోతుంది. అంటే జపాన్‌లో ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచిన మునుపటి తరం ప్రజలు ఇప్పుడు వృద్ధులయ్యారు. పది శతాబ్దాలుగా యువత ఉత్సాహంగా జరుపుకున్న హడక మత్సూరి పండుగ ఇప్పుడు వృద్ధాప్యంతో అంతరించిపోయే దశకు చేరుకుంటుంది. ఒక నివేదిక ప్రకారం ఈసారి జపాన్‌లో జరుపుకునే షిప్ మత్సూరి పండుగ అంటే న్యూడ్ ఫెస్టివల్ ఇదే చివరి సారి అని తెలుస్తోంది.

జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోని ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని అడవిలోని కొకుసేకి-జి ఆలయంలో జరిగిన హడకా మత్సూరి లేదా సోమిన్ సాయి ఉత్సవంలో వందలాది మంది యువకులు ఎక్కువగా నగ్నంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో ‘జస్సో జోయాసా’ (అంటే చెడును అంతం చేయడం) అనే నినాదాలు వినిపించారు. ఏటా వేలాది మంది జపనీయులు పాల్గొనే విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రత్యేక న్యూడ్ ఫెస్టివల్ ఈ ఏడాది ముగిసింది. గత కొన్నేళ్లుగా ఈ పండుగ కనుమరుగైంది. ఈ పండగలో పాల్గొనేవారి సంఖ్య క్రమంగా  తగ్గుముఖం పట్టింది.

హటకా మత్సూరి పండుగ ప్రత్యేకత ఏమిటి?

యువత జరుపుకునే పండుగ ఇది. యువకులు తెల్లలంగోటాలు మాత్రమే ధరిస్తారు. చాంద్రమాన నూతన సంవత్సరం ఏడవ రోజున ఈ పండుగను రాత్రంతా జరుపుకుంటారు. మొదట నగ్నంగా ఉన్న యువకులు కొకుసేకి-జీ ఆలయ సమీపంలోని యముచి నదిలో చలిలో స్నానం చేసి చెడును అంతం చేయండి అంటూ  అరుస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత యువత మధ్య హితాకి నోబోరి, బెట్టో నోబోరి, ఒనిగో నొబోరి వంటి పోటీలు నిర్వహిస్తారు. ఇది రాత్రి నుండి ఉదయం వరకు సాగుతుంది ఈ పండగ. చివర్లో సోమిన్ అనే బ్యాగును తెచ్చుకునేందుకు యువకుల మధ్య పోటీ నెలకొంది. ఈ పండుగకు ఇదే ప్రధాన ఆకర్షణ. వందలాది మంది పురుషులు చెక్కతో కూడిన గుడి లోపల కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ, దూకుడుగా టాలిస్మాన్‌ల బ్యాగ్‌పై దూకారు.

ఈ నగ్న వేడుక ఎందుకు?

వెయ్యి ఏళ్ల క్రితం ప్లేగు వంటి అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. ఈ సీజన్‌లో ఈ ప్రదేశంలో విపరీతమైన చలి ఉంటుంది. ఈ చలిలో యువత దాదాపు బట్టలు విప్పి నది నీటిలో చిందులు వేస్తూ పండుగ జరుపుకున్నారు.

ఇప్పుడు జపాన్‌లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమినాయి పండుగను నిష్ఠగా జరుపుకునే ముందు తరాల వారు వృద్ధులు అయ్యారు. ఇప్పటి తరం జనాభా పెద్దగా లేదు. దీంతో ఈ బెట్టాల పండుగ చరిత్ర పుటలో చేరిపోతోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..