Viral News: సెలవులు, డబ్బుల కోసం అమ్మతనాన్నే అడ్డుపెట్టుకున్న మహిళ.. 17 సార్లు గర్భవతిగా నాటకం.. చివరికి..

ఓ మహిళ జీతంతో పాటు 6 నెలల సెలవులు, డబ్బుల కోసం తాను గర్భవతిని అని అబద్ధం చెప్పింది. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా గర్భవతి అని 17 సార్లు అబద్ధం చెప్పి 98 లక్షలకు పైగా మోసం చేసింది. ఇప్పుడు మహిళ చేసిన మోసం  వెలుగులోకి రావడంతో ఆ మహిళను పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. 

Viral News: సెలవులు, డబ్బుల కోసం అమ్మతనాన్నే అడ్డుపెట్టుకున్న మహిళ.. 17 సార్లు గర్భవతిగా నాటకం.. చివరికి..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2024 | 12:02 PM

కార్మిక చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు  డెలివరీ తేదీ నుండి సుమారు 6 నెలల వేతనంతో కూడిన సెలవు ఇవ్వబడుతుంది. అంతేకాదు గర్భిణులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రభుత్వం ఇస్తున్నసదుపాయాలకు, డబ్బులకు ఆశపడిన ఓ స్త్రీ దుర్వినియోగం చేసింది. ఏకంగా లక్షలు మోసం చేసింది. ఓ మహిళ జీతంతో పాటు 6 నెలల సెలవులు, డబ్బుల కోసం తాను గర్భవతిని అని అబద్ధం చెప్పింది. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా గర్భవతి అని 17 సార్లు అబద్ధం చెప్పి 98 లక్షలకు పైగా మోసం చేసింది. ఇప్పుడు మహిళ చేసిన మోసం  వెలుగులోకి రావడంతో ఆ మహిళను పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. వివరాల్లోకి వెళ్తే..

ఇటలీకి చెందిన బార్బరా ఐయోల్ (50) గత 24 ఏళ్లుగా ప్రెగ్నెన్సీ డ్రామాలాడుతున్న మహిళ. తాను ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చానని, ఇప్పటివరకు 12 మంది గర్భస్రావాలు జరిగినట్లు ఆ మహిళ పేర్కొంది. మెట్రో నివేదిక ప్రకారం మన దేశ కరెన్సీలో ఐయోల్ రూ.98 లక్షలకు పైగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందింది. అంతే కాదు గర్భిణీ అని అబద్ధం చెప్పిన ప్రతిసారీ 6 నెలలపాటు ఉద్యోగానికి వెళ్లకుండా హాయిగా జీవితాన్ని గడిపింది.

17వ సారి ఐయోల్ తాను గర్భం దాల్చినట్లు.. కంపెనీ నుంచి సెలవులు, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించమంటూ అధికారులకు అభ్యర్ధించింది. దీంతో ఆమెపై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే విచారణ చేపట్టారు. ఈ విచారణలో మహిళ అసలు రంగు బయటపడింది. తను గర్భవతి అని చెప్పుకోవడం మాత్రమే కాదు.. అది నమ్మించడానికి కడుపులో దిండ్లు పెట్టుకునేది. ప్రెగ్నెన్సీ, డెలివరీకి సంబంధించిన నకిలీ పత్రాలను కూడా సృష్టించింది. “ఆమె ఎప్పుడూ గర్భవతి కాలేదు. ఆమె భర్త డేవిడ్ పిజినాటో కూడా ఆమె గర్భవతిగా నటించిందని ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. కోర్టు ఆమెకు అరెస్టు చేసి సంవత్సరం ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..