AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి ఎస్సై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ అనూహ్య ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సంతోష్‌ ముఖర్జీ (38) బతుకుదెరువు దృష్ట్యా హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే కుటుంబ సమస్యల కారణంగా వేదనకు గురైన ముఖర్జీ చెట్టుకు...

Viral Video: చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 19, 2024 | 11:09 AM

Share

గుండెపోటు సమస్యలు ఎక్కువుతోన్న ప్రస్తుత రోజుల్లో సీపీఆర్‌ గురించి ప్రతీఒక్కరికీ అవగాహన పెరుగుతోంది. ప్రాణం పోయే వ్యక్తిని కాపాడే శక్తి ఈ సీపీఆర్‌కు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌ సీపీఆర్‌ నిర్వహించి చావు అంచులకు చేరుకున్న వ్యక్తిని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి ఎస్సై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ అనూహ్య ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సంతోష్‌ ముఖర్జీ (38) బతుకుదెరువు దృష్ట్యా హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే కుటుంబ సమస్యల కారణంగా వేదనకు గురైన ముఖర్జీ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై మైబెల్లి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన ముఖర్జీని వెంటనే కిందికి దించారు. అప్పటికే అతని శ్వాస ఆగిపోవడంతో సీపీఆర్‌ చేశారు. కొద్దిసేపటికి బాధితుడు స్పృహలోకి రావడంతో అతను ప్రాణాలతో బయటపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన సేవ అందించడంతో ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు సెల్‌ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ ద్వారా ప్రాణాలు పోసిన ఎస్సైపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!