Robotic Device: ప్రాణాలు తీసిన సర్జికల్ రోబో.! అమెరికాలో కోర్టుకెక్కిన బాధిత కుటుంబం.!
మానవులతో సాధ్యం కాని పనులు రోబోలు చేసి పెడతాయని ప్రపంచం నమ్ముతోంది. అయితే ఇది కొన్ని సార్లు సాధ్యం కాదన్న నిజం మరోసారి బయటపడింది. అమెరికాలో డాక్టర్లు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్ వికటించింది. శస్త్ర చికిత్సలో వాడిన సర్జికల్ రోబో ఒక మహిళ చిన్న పేగుకు రంధ్రాలు చేసింది. ఇది ఆమె మరణానికి దారితీసిందని ఆమె భర్త అక్కడి కోర్టులో దావా వేశారు.
మానవులతో సాధ్యం కాని పనులు రోబోలు చేసి పెడతాయని ప్రపంచం నమ్ముతోంది. అయితే ఇది కొన్ని సార్లు సాధ్యం కాదన్న నిజం మరోసారి బయటపడింది. అమెరికాలో డాక్టర్లు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్ వికటించింది. శస్త్ర చికిత్సలో వాడిన సర్జికల్ రోబో ఒక మహిళ చిన్న పేగుకు రంధ్రాలు చేసింది. ఇది ఆమె మరణానికి దారితీసిందని ఆమె భర్త అక్కడి కోర్టులో దావా వేశారు. సర్జికల్ రోబోను విక్రయించిన ‘ఇంట్యూటివ్ సర్జికల్’ సంస్థ 75 వేల డాలర్లు నష్టపరిహారంగా తనకు చెల్లించాలని కోర్టును కోరారు. ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం ప్రకారం, సాండ్రా సుల్జర్ భర్త హార్వే సుల్జర్ ‘ఇంట్యూటివ్ సర్జికల్’ కంపెనీపై కోర్టులో కేసు వేశారు. 2021లో ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో సాండ్రా సుల్జర్ పెద్ద పేగుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. రిమోట్‌తో పనిచేసే ‘డా విన్సీ’ అనే సర్జికల్ రోబోను వైద్యులు ఆపరేషన్‌లో వినియోగించారు. రోబో వల్ల ఆమె చిన్న ప్రేగుకు రంధ్రాలు అయ్యాయి. ఆపరేషన్ తదనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై.. 2022 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఆపరేషన్ సమయంలో అంతర్గత అవయవాలను రోబో దెబ్బతీస్తున్న సంగతి కంపెనీకి ముందే తెలుసునని, ఈ సంగతి కుటుంబ సభ్యులకు తెలియజేయలేదని మృతురాలి భర్త ఆరోపించారు. రోబోతో ఏర్పడిన గాయాలు, లోపాల గురించి కంపెనీకి వేలాది నివేదికలు అందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డా విన్సీ రోబో వాడకంపై వైద్యులకు తగిన శిక్షణ ఇవ్వడంలో సంస్థ విఫలమైందని, అనుభవం లేని ఆసుపత్రులకు రోబోలను విక్రయించిందని ఆయన ఆరోపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

