Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు..
దిన ఫలాలు (ఫిబ్రవరి 20, 2024): మేష రాశి వారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది అనుకూల సమయం. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (ఫిబ్రవరి 20, 2024): మేష రాశి వారు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది అనుకూల సమయం. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. అంతా మంచే జరుగుతుంది. కొన్ని ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు బాగా బిజీ అయిపోతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపో తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దాదాపు అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులు, స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలుంటాయి. సతీమణికి అదృష్టం పడుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో సామ రస్య వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి బాగా సంతృప్తికరంగా ఉంటుంది. వీలైనంతగా అవనసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువు లతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సంపాదనకు లోటుండదు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్య మైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు కొద్దిగా ఇబ్బందిపెట్టే సూచన లున్నాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మంచి ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ప్రముఖు లతో పరిచయాలు పెంపొందుతాయి. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సతీమణితో శుభకార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొన్నిఇబ్బందులుంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్తోమతకు మించి స్నేహితులకు సహాయపడతారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా శుభవార్తలు వింటారు. భాగస్వామ్య సంబంధమైన విభేదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కొందరు బంధువుల నుంచి ముఖ్యమైన వ్యవహారాలలో సహాయం లభిస్తుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థితిగతులు కొద్దిగా మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, వినోదాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం నిలకడగా ముందుకు సాగుతుంది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇతరుల వ్యవ హారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. సతీమణికి ఆశించిన పురోగతి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. అంచనాలకు మించి సంపాదన పెరు గుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. ఆర్థికపరంగా అనుకూల పరి స్థితి నెలకొని ఉంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారమవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.