Budha Gochar 2024: కుంభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!

Mercury Transit in Kumbha Rashi: ఈ నెల 19న(సోమవారం) బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. కుంభ రాశిలో ఇప్పటికే శని, రవుల సంచారం జరుగుతోంది. బుధుడు కుంభ రాశిలో మార్చి 7 వరకూ ఉంటాడు. అప్పటి వరకు శని, రవి, బుధులు ఈ రాశిలో కలిసి ఉంటాయి. ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

Budha Gochar 2024: కుంభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Budha Gochar 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 18, 2024 | 8:02 PM

ఈ నెల 19న(సోమవారం) బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. కుంభ రాశిలో ఇప్పటికే శని, రవుల సంచారం జరుగుతోంది. బుధుడు కుంభ రాశిలో మార్చి 7 వరకూ ఉంటాడు. అప్పటి వరకు శని, రవి, బుధులు ఈ రాశిలో కలిసి ఉంటాయి. ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుంభ రాశిలో బుధ, రవుల యుతి వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుండగా, బుధ, శనుల కలయిక వల్ల ధన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడిని పెంచుకోవ డానికి పట్టుదలగా ప్రయత్నించడం అనేది ఈ మూడు గ్రహాల కలయికకు సంకేతం.

  1. మేషం: ఈ రాశివారు కొద్ది రోజుల పాటు ఏ ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయాలు సాధించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, రాబడి బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగు లకు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, లాయర్లకు, మద్యం డీలర్లకు ఈ మూడు గ్రహాల కలయిక అనేక విధాలుగా ఆదా యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇందుకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ మూడు గ్రహాల కాంబినేషన్ ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణించడం, గుర్తింపు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి. అన్ని విధాలు గానూ రాబడి, లాభాలు పెరుగుతాయి. వ్యాపారంలో తిరుగుండదు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడ తాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం.
  3. మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో తన ఇద్దరు మిత్రులతో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టింది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలన్నీ వసూలు అవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అదనపు ఆదాయానికి అవకాశమున్న ఉద్యోగం లభిస్తుంది.
  4. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, బుధ, శనీశ్వరుల యుతి జరుగుతున్నందువల్ల కొన్ని ముఖ్య మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధిలోకి వస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఆదాయ వృద్ధి జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు ధర్మకర్మా దిప యోగమనే విశేషమైన, అరుదైన యోగం కూడా ఏర్పడింది. ఆర్థికంగా తిరుగులేని పురోగతి ఉంటుంది. అన్ని విధాలు గానూ ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరు తాయి. లాభదాయకమైన పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపార సంబంధమైన ఒప్పం దాలు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు సంభవిస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఊపందుకుంటాయి. పోటీదార్లు వెనక్కి తగ్గుతారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబపరంగా కొన్ని శుభవార్తలు వింటారు. ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు