AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ నాలుగు రాశుల వారు బంగారం ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు.. ఆ రాశులు ఏమిటంటే..

జ్యోతిషశాస్త్రం ప్రకారం బంగారం బృహస్పతి గ్రహంతో ముడిపడి ఉంది. బంగారం ప్రభావం ఒక్కో రాశి వారిపై ఒక్కో విధంగా ఉంటుంది. మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి, మీన రాశుల వారికి బంగారం ధరించడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. ఈ నాలుగు రాశుల వారు బంగారం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: ఈ నాలుగు రాశుల వారు బంగారం ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు.. ఆ రాశులు ఏమిటంటే..
Benefits Of Gold Jewelry
Surya Kala
|

Updated on: May 08, 2025 | 5:11 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం బంగారం నవ గ్రహాల్లో ఒక గ్రహమైన బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అయితే బంగారం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి బంగారు ఉంగరం శుభప్రదం అయితే మరికొందరికి అది అశుభకరమైనది కావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారం ధరిస్తే అదృష్టవంతులు. వారిని ఆర్థికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. కొన్ని రాశుల వారికి శ్రేయస్సు, శుభ ఫలితాలు, జీవితంలో విశ్వాసం కూడా పెరుగుతాయి. మరి ఈ రోజు బంగారం ధరిస్తే లక్కీ అందుకునే రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారు బంగారు ఉంగరం ధరించడం చాలా శుభప్రదం. ఇలా చేయడం ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీనివల్ల వీరి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు వీరికి ఆర్థిక వృద్ధికి కూడా సహాయపడుతుందని నమ్ముతారు.

సింహ రాశి: సింహ రాశిలో జన్మించిన వారికి బంగారు ఉంగరం బలాన్ని ఇస్తుంది. దీనిని ధరించడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వీరి చేసే పనిలో గౌరవం పొందుతారు. దీనివల్ల సింహ రాశి వారు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. భవిష్యత్తులో మంచి మార్గాలు తెరుచుకుంటాయి.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు బంగారం ధరించడం అదృష్టం. ఇది విద్యలో విజయం సాధించడంలో వీరికి సహాయపడుతుంది. వీరు చేపట్టిన పనిలో ముందుకు సాగుతారు. ఏపని మొదలు పెట్టినా మరింత ప్రోత్సాహాన్ని పొందే అవకాశం ఉందని నమ్ముతారు.

మీన రాశి: మీన రాశి వారు బంగారం ధరించడం శుభప్రదం. వీరు మానసికంగా బలంగా ఉంటారు. వీరి జీవితాల్లో శాంతి వస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. పసిడి ఉంగరం ధరించడం వలన వీరిలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.