తిరుపతి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే ది డిఫరెంట్ స్టైల్. అసెంబ్లీలో నైనా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నైనా అందరినీ ఆకట్టుకునేలా వ్యవహరించడం ఆ ఎమ్మెల్యే ప్రత్యేకత. భాష యాస తో పాటు హావభావాలతో వేదికల్లోనైనా, సభల్లో నైనా జనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలివాలనుకుంటారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చెప్పు మధుసూదన్ రెడ్డి. తాజాగా పులి వేషం కళాకారులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టాడు. శ్రీ కాళహస్తి మున్సిపాలిటీలోని 18 వ వార్డులో గడప గడపకు కార్యక్రమంలో జగనన్నకు మేము తోడు అంటూ స్థానికుల సంబరాలు జరుపుకోగా అందులో భాగస్వామ్యం అయ్యారు.
పులి నృత్యంతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే మధు జయరామారావు వీధి, ఎస్టీ కాలనీతో పలు చోట్ల గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో జగనన్న సంక్షేమ పాలనను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వైసీపీ శ్రేణులతో కలిసి సాంప్రదాయ కళగా పులి వేషం వేసిన స్థానికులతో మమేకం అయ్యారు. పులి వేషంతో స్వాగతం పలికిన వారితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టిన ఎమ్మెల్యే మధు తనది డిఫరెంట్ స్టైల్ అని నిరూపించాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..