‘సామాజిక విప్లవానికి సీఎం జగన్‌ నాంది..’ దిగ్విజయంగా కొనసాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర..

ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇవాళ యలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాల వైసీపీ బస్సు యాత్రలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాలుగున్నరేళ్ల జగన్‌ పాలనలో అందిన సంక్షేమ పథకాలను బస్సు యాత్రల ద్వారా వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు.

'సామాజిక విప్లవానికి సీఎం జగన్‌ నాంది..' దిగ్విజయంగా కొనసాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర..
Ysrcp Bus Yatra
Follow us

|

Updated on: Nov 21, 2023 | 5:31 PM

ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇవాళ యలమంచిలి, నరసరావుపేట, మైదుకూరు నియోజకవర్గాల వైసీపీ బస్సు యాత్రలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాలుగున్నరేళ్ల జగన్‌ పాలనలో అందిన సంక్షేమ పథకాలను బస్సు యాత్రల ద్వారా వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు.

ఏపీలో మళ్లీ అధికారమే టార్గెట్‌గా అధికార వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. దశలవారీగా బస్సుయాత్రలు నిర్వహిస్తోంది. ఇప్పటికే.. ఓ రౌండ్‌ బస్సు యాత్రలు కంప్లీట్‌ కాగా.. రెండో విడతలోనూ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. తాజాగా.. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. పల్నాడు బస్టాండు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. నాలుగున్నరేళ్ల పాలనలో సామాజిక విప్లవానికి సీఎం జగన్‌ నాంది పలికారని కొనియాడారు మంత్రి మేరుగు నాగార్జున.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆధ్వర్యంలో వైసీపీ బస్సుయాత్ర కొనసాగింది. అచ్యుతాపురం పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌తోపాటు పలువురు ప్రజాప్రనిధులు పాల్గొన్నారు. 14 ఏళ్ల పాలనలో పేదలకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలు గమనించాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

కడప జిల్లా మైదుకూరులో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు మంత్రులు విడదల రజిని, నారాయణస్వామి, అంజద్‌పాషాతోపాటు పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు. ప్రొద్దుటూరు రోడ్‌లో బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా.. నాలుగున్నరేళ్ల జగన్‌ ప్రభుత్వంలో.. పేద వర్గాలకు డీబీటీ పద్దతిలో 2లక్షల 40వేల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందజేశారని తెలిపారు మంత్రి విడదల రజిని. మొత్తంగా.. రెండో విడత వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పేద, బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్రలు చేపట్టింది అధికార వైసీపీ.