చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. సజ్జల రియాక్షన్ ఏమంటే..? – Watch Video
చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల అన్నారు. తద్వారా ప్రపంచానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుపై నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. సీఎం చెప్తేనే డబ్బులు విడుదల చేశామని అధికారులు నోట్ ఫైల్ లో పేర్కొన్నారని గుర్తుచేశారు.
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తద్వారా ప్రపంచానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుపై నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. సీఎం చెప్తేనే డబ్బులు విడుదల చేశామని అధికారులు నోట్ ఫైల్ లో పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. ఇంత జరిగినా అసలు ఇది స్కాం కాదని, చంద్రబాబు ప్రమేయం లేదని ఎలా చెప్తారని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేదని కోర్టులో నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు పై ఇంకా నాలుగు కేసులున్నాయని గుర్తుచేశారు.
రాజకీయంగా చంద్రబాబు లోపలున్నా,బయట ఉన్నా ఒకటేనని సజ్జల వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాలు లేదా వయసును అడ్డుపెట్టుకుని కేసుల నుంచి బయట పడాలని చూస్తున్నారని అన్నారు.