YS Viveka: వివేకాతో బంధంపై రెండో భార్య స్పందన.. సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు
ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న వైఎస్ వివేకా కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. వైఎస్ వివేకా కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. కేసు ముగింపు దశకి చేరుకుంటోన్న సమయంలో వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకంపనలు రేపుతోంది. వైఎస్ వివేకా కేసులో సీబీఐ తాజా దర్యాప్తు కీలకంగా మారింది...
ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న వైఎస్ వివేకా కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. వైఎస్ వివేకా కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. కేసు ముగింపు దశకి చేరుకుంటోన్న సమయంలో వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకంపనలు రేపుతోంది. వైఎస్ వివేకా కేసులో సీబీఐ తాజా దర్యాప్తు కీలకంగా మారింది. వివేకా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణ సందర్భంగా వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి వెల్లడించిన విషయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి తాను కోడలినని సీబీఐకి చెప్పారు షమీమ్. వివేకా కేసులో సంచలన విషయాలు వెల్లడించింది వివేకా రెండో భార్య షమీమ్. ఇప్పుడిదే ఏపీలో కలకలం రేపుతోంది.
2005లో ఎమ్మెస్సీ కంప్లీట్ చేసి, ఉద్యోగ వేటలో ఉండగా తన ఉద్యోగం కోసం వివేకా స్వయంగా రెడ్డీస్ ల్యాబ్ కి వచ్చినట్టు సీబీఐకి వెల్లడించారు షమీమ్. వివేకా రికమండేషన్ లెటర్ ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో తానే స్వయంగా వచ్చి దగ్గరుండి జాబ్ లెటర్ ఇప్పించారంది షమీమ్. 2010లో వివాహం అయ్యిందన్న షమీమ్… వివేకా తనకు 2008లోనే ప్రపోజ్ చేశాడనీ, అయితే రెండేళ్ల తరువాత తాను ఆ ప్రపోజల్‌ని అంగీకరించానని పేర్కొన్నారు. వివేకా భార్యకు అన్యాయం చేయలేనని చెప్పానని, అయితే తన భార్యకున్న అనారోగ్యం విషయంపై ఆయన వివరించారని వెల్లడించింది షమీమ్. వివేకాకి తన భార్యపై ఉన్న ప్రేమే వివేకాపై తనకి గౌరవం పెంచిందన్నారు షమీమ్.
2010లో తనకీ వివేకాకీ పెళ్లి జరిగిందనీ, ఆ తరువాత 2015లోతనకీ వివేకాకీ షెహన్‌షా జన్మించినట్టు సీబీఐ ఎదుట వెల్లడించింది షమీమ్. వివేకా పదవి, ఆస్తి పై శివ ప్రకాష్ రెడ్డి, రాజా శేఖర్ రెడ్డి లకు వ్యామోహం ఉందనీ, అయితే వివేకా తన తమ్ముడిని సైతం సొంత కొడుకులా భావించాడంది. అందుకే వివేకా తన తమ్ముడికి కూడా సునీత, రాజ శేఖర్, శివ ప్రకాష్ లతో సమంగా వాటా ఇస్తానన్నాడనీ, తన వ్యాపారాల్లో 25 శాతం తన తమ్ముడికి ఇవ్వాలని వివేకా భావించారని షమీమ్ వెల్లడించడం సంచలనంగా మారింది. అంతేకాదు తమ మధ్య ఉన్న బంధాన్ని బలపరిచే మరో విషయాన్ని సైతం షమీమ్ వెల్లడించారు. సెప్టెంబర్ 2011లో తనని తీసుకొచ్చి…వనస్థలిపురంలోని ఓ డీజీపీ ఇంట్లో ఉంచినట్టు పేర్కొంది షమీమ్. దాదాపు మూడు నెలల పాటు అదే ఇంట్లో షమీమ్, ఆమె తల్లి ఉన్నట్టు పేర్కొంది. ఇదే విషయంపై షమీమ్ తల్లిదండ్రులను ప్రశ్నించగా…తమకేం తెలియదని, వాళ్లని ఎదిరించలేమని సమాధానం ఇచ్చారు.
వైఎస్ కుటుంబానికి నేను కోడలిని..
వివేకాకు మంత్రి పదవి వచ్చాకా నాదగ్గరికి రావడం కుదరలేదన్నారు షమీమ్. వివేకా పదవి, వివేక ఆస్తి పై శివ ప్రకాష్ రెడ్డి, రాజా శేఖర్ రెడ్డి లకు వ్యామోహం ఉందన్న ఆమె.. వివేకా చనిపొవడంతో నేను, నా కొడుకు అనాథలమయ్యాం. ఇంకా ఆమె మాట్లాడుతూ..’వైఎస్ కుటుంబానికి నేను కోడలిని. ప్రస్తుతం నా కొడుకు మైనర్ గా ఉన్నాడు. నా తమ్ముడు సుభాన్ ను సైతం వివేకా కొడుకులా భావించాడు. వివేకా వ్యాపారాల్లో 25 శాతం వాటడారుడిగా నా తమ్ముడిని చేర్చాలనుకున్నాడు. వైఎస్ సునీత, రాజ శేఖర్, శివ ప్రకాష్ ల తో సమానంగా నా తముడికి వ్యాపారంలో వాటా ఇస్తా అన్నాడ’ని షమీమ్ చెప్పుకొచ్చారు.
తమ కుమారుడు షెహన్‌షా పేరుపై 4 ఏకరాలు పొలం కొందామని వివేకా అనుకున్నారని…కానీ దాన్ని శివ ప్రకాష్ రెడ్డి ఆపేశారని పేర్కొన్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని…అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలిగించారని సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు షమీమ్. వివేకా ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారని…బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్‌తో రూ. 8 కోట్లు వస్తాయని తనతో చెప్పినట్లు వెల్లడించారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా వివేకా రూ. 8 కోట్ల గురించి మాట్లాడారని తెలిపారు షమీమ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..