YS Viveka: కేసును వదిలేయాలంటూ బెదిరింపులు.. భద్రత కల్పించాలంటూ కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు సునీతా లేఖ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేయగా, ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సంచలన ఆరోపణలు..

YS Viveka: కేసును వదిలేయాలంటూ బెదిరింపులు.. భద్రత కల్పించాలంటూ కడప ఎస్పీకి వైఎస్ వివేకా కూతురు సునీతా లేఖ
Ys Sunitha Reddy (file)
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 13, 2021 | 5:12 PM

YS Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రోజు రోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన హత్య కేసును ఛేదించాలంటూ వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ ఎంక్వేరికి ఆదేశించింది హైకోర్టు. ఒక వైపు సీబీఐ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేయగా, అసలు నిందితులు ఎవరనేదీ ఇప్పడిప్పుడే తేలుతోంది. ప్రధాన అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. అయితే, తనకే బెదిరింపులు వస్తున్నాయని.. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప జిల్లా ఎస్పీకి వైఎస్‌ సునీతా రెడ్డి లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌ చేశాడని లేఖలో సునీత పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని ఆమె జిల్లా ఎస్పీని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

Ys Sunitha Reddy Letter To Sp

Ys Sunitha Reddy Letter To Sp 1

స్పందించిన కడప జిల్లా ఎస్పీ

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు అందిందని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కుటుంబ రక్షణ కోసం చర్యలు చేపట్టామని తెలిపారు.  వ్యక్తిగతంగా, పులివెందులలో వారి నివాసం వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సునీత లెటర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపై తక్షణం విచారణ చేపడతామని అన్బురాజన్‌ చెప్పారు.

Read Also… Grenade Attack: రాజకీయ నేతలే టార్గెట్‌గా ఉగ్రవాదుల ఘాతుకాలు.. జమ్మూ కశ్మీర్ గ్రెనేడ్ దాడిలో నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేస్తోంది.. అఫీషియల్‌‌‌గా అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Fake Challans: ఫేక్ చలానాలతో రిజిస్టేషన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. రివ్యూలో హాట్ కామెంట్స్