YS Jagan: సీఎం జగన్ మార్క్.. అధికారులు, పార్టీ నేతలకు భారీ టాస్క్ అప్పగింత.. టార్గెట్ పది రోజులే..!
AP CM Jagan London Tour: సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కోసం లండన్‌కు వెళ్తున్నారు. సెప్టెంబర్ రెండో తేది అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఇదే ఛాన్స్ అనుకోని సీఎంఓ అధికారులు.. వాళ్ల కింద సిబ్బంది సెలవు పెట్టాలని భావించారు.. కానీ సీఎం వాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ఎవరు ఏక్కడికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా.. పార్టీ నేతలకు కూడా ఓ టాస్క్ ఇచ్చారు. ఈ పది రోజులు వాళ్లు ఏం చేయాలో కూడా చెప్పారు.. ఆ వివరాలేంటో చూద్దాం..

అమరావతి, సెప్టెంబర్ 01: సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కోసం లండన్‌కు వెళ్తున్నారు. సెప్టెంబర్ రెండో తేది అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకూ ఆయన విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఇదే ఛాన్స్ అనుకోని సీఎంఓ అధికారులు.. వాళ్ల కింద సిబ్బంది సెలవు పెట్టాలని భావించారు.. కానీ సీఎం వాళ్లందరికీ షాక్ ఇచ్చారు. ఎవరు ఏక్కడికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా.. పార్టీ నేతలకు కూడా ఓ టాస్క్ ఇచ్చారు. ఈ పది రోజులు వాళ్లు ఏం చేయాలో కూడా చెప్పారు.. ఆ వివరాలేంటో చూద్దాం.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అందులోనూ అధికార పార్టీ అధ్యక్షుడు.. ఇన్ని రోజులు విదేశీ పర్యటనకు వెళ్తే మరి పార్టీ పరిస్థితి ఏంటి..? పట్టించుకునే వారు లేరు కదా అని ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరించకూడదు కదా..? ముఖ్యంగా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.. అందుకే తాను రాష్ట్రంలో లేకపోయినా పార్టీ నేతలకు మాత్రం బిగ్ టాస్క్ ఇచ్చారు సీఎం జగన్. పదిరోజుల పాటు సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారట. ఈ కమిటీలో పార్టీ ముఖ్య నేతలు, సీఎంఓ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నందున నియోజకవర్గాల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే దిశానిర్ధేశం చేసారట సీఎం.. ఈ పదిరోజుల పాటు తాను పార్టీపరంగా సూచించిన అన్ని అంశాలు అమలవుతున్నాయా లేదా ఎక్కడైనా ఇబ్బందులున్నాయా అని చూసి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యతను కమిటీకి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు గురించి అధికారులకు.. పార్టీ కార్యక్రమాల గురించి పార్టీ పెద్దలకు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
ఎలక్షన్ కోసం భారీ టాస్క్ అప్పగించిన సీఎం జగన్
ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ కేడర్ ను కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది వైసీపీ. ఇప్పటికే సుమారు ఏడాదిన్నర కాలంగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సచివాలయాల వారీగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లి వారితో ఆప్యాయంగా మాట్లాడటం ద్వారా అక్కడి ప్రజలతో బాండింగ్ ఏర్పడుతుందని.. ప్రజల్లో అభిమానం ఉంటుందని.. దాన్ని ఓట్లుగా మలుచుకునే అవకాశం ఉంటుందనేది వైసీపీ ఆలోచన.. ఓవైపు ప్రజల్లోనే నేతలంతా ఉంటున్నప్పటికీ పోలింగ్ సమయానికి ఓట్లు మాత్రం వేరే పార్టీకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత బూత్ లెవల్ నాయకులు, ఏజెంట్లకు ఉంటుంది. అందుకే సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో ఎన్నికలకు కీలకమైన బూత్ లెవల్ నాయకులు, పోలింగ్ ఏజెంట్లపై దృష్టి పెట్టాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసారని తెలిసింది. కమిటీలోని సభ్యులు పది రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఇంచార్జిలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ బూత్‌ల వారీగా వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లతో ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం, స్థానికంగా ఉన్న పరిస్థితులపై ఓ నిర్ణయానికి వచ్చేలా సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల రోజు కీలకమైన వాటిలో ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమైంది. ఇప్పటికే బూత్‌ల వారీగా బీఎల్ఓల నియామకం కూడా పూర్తయింది. ఎక్కడైనా బీఎల్ఓల నియామకాలు జరగకుంటే ఈ పదిరోజుల్లో పూర్తిచేసి వారితో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల నుంచి వివరాలన్నీ తీసుకుని సీఎం నియయమించిన కమిటీ ఓ నివేదికను రూపొందించనుంది. ఈ నివేదికను సీఎం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు అందించనున్నారు.
నియోజకవర్గాల్లో పరిస్థితులపై నివేదికలిస్తున్న పరిశీలకులు
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై పార్టీ పరిశీలకులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి వివరాలు అందిస్తున్నారు. ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదు, పార్టీలో ఉన్న అంతర్గత విబేధాల పరిష్కారం వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ఇంచార్జి లేదా ఎమ్మెల్యే గెలుపోటములపైనా పరిశీలకులు రిపోర్టులు ఇస్తున్నారు. ఓవైపు పరిశీలకులు ఇచ్చే నివేదికలు, మరోవైపు బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాల ద్వారా వచ్చే నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాలపై ఓ స్పష్టతకు రానున్నారు పార్టీపెద్దలు. మొత్తానికి ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమయ్యేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. సీఎం జగన్ విదేశీపర్యటన ముగిసిన తర్వాత మరోసారి పార్టీ పరిశీలకులు, ఇంచార్జిలతో సమావేశం ఏర్పాటు చేసి సీట్ల విషయంలో సీఎం జగన్ ఓ నిర్ణయానికి వస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..
