YS Jagan: 40 శాతం ప్రజలు మనవైపే.. ప్రలోభాలకు లొంగొద్దు.. కేసులు పెట్టినా భయపడొద్దు: జగన్ కీలక వ్యాఖ్యలు

శాసనసభలో నోరు కట్టడి చేసే అవకాశం ఉంది... శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ సూచించారు. గురువారం వైఎస్‌ జగన్‌‌ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..

YS Jagan: 40 శాతం ప్రజలు మనవైపే.. ప్రలోభాలకు లొంగొద్దు.. కేసులు పెట్టినా భయపడొద్దు: జగన్ కీలక వ్యాఖ్యలు
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2024 | 2:03 PM

శాసనసభలో నోరు కట్టడి చేసే అవకాశం ఉంది… శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ సూచించారు. గురువారం వైఎస్‌ జగన్‌‌ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ ఎమ్మెల్సీలకు సూచించారు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారంటూ గుర్తుచేశారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయి.. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయంటూ వివరించారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన హనీమూన్‌ నడుస్తోందని.. వారికి మరికొంత సమయం ఇచ్చి..తర్వాత పోరాడుదాం.. అంటూ ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీలో తమ నోరును కట్టడి చేసే అవకాశం ఉందని.. మండలిలో గట్టిగా పోరాడుదాం అంటూ జగన్‌ సూచించారు.

ఇటీవల జరిగిన జనరల్‌ ఎలక్షన్‌లో ఘోర ఓటమిపాలైన వైసీపీకి, శాసనమండలిలో మాత్రం 39 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. త్వరలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధానంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతోపాటు ఇతర కీలక బిల్లులను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మరికొన్ని బిల్లులను కూడా ఉపసంహరించే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో శాసనసభలో బలం లేకపోయినా.. మండలిలో ఉన్న బలంతో ఆయా బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ప్రతిఘటనకు అవకాశం ఉంటుంది. అలాగే అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తగినంత బలం ఉండాలి. ఈ క్రమంలో ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్సీలకు వైఎస్‌ జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది.

త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన..?

ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది.. టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని ఎమ్మెల్సీల సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన దాడులపై కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..